రేపే మహా శివరాత్రి.. ఏమి చెయ్యకపోయినా ఈ చిన్న పని చేయండి చాలు… పాపాలు పోతాయి

121

హిందువుల పవిత్ర పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈరోజు పరమ శివుడ్ని భక్తితో కొలుస్తారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 21 వ తేదీన వచ్చింది. ఆ రోజు ఆ పరమాత్మని ఎంతో భక్తితో పూజించాలి. శివరాత్రి పూజా విధానానికి చాలా ప్రత్యేకత ఉంటుంది.. శివరాత్రి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తలస్నానము చేసి పూజ చేసుకొని శివాలయానికి వెళ్లి లింగ దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా శివరాత్రి రోజు లింగ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. శివరాత్రి రోజు గుడికి వెళ్లే సమయంలో తెలుపు, పసుపు వంటి లేత రంగు కలర్ దుస్తులను ధరించాలి. శివరాత్రి రోజున శివునికి మారేడు, తెల్లజిల్లేడు, బిల్వ పత్రాలతో పూజ చేయాలి. ఇవి శివునికి అత్యంత ప్రీతికరమైనవి. అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. శివునికి జామకాయ నైవేద్యం పెట్టాలి. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే శివుని కృపకు పాత్రులు అవుతాం. ఉపవాసం చేయలేని వారు అన్నం తినకుండా కేవలం పండ్లను మాత్రమే తిని చేయవచ్చు.

ఈ క్రింది వీడియోని చూడండి

శివరాత్రి పూజ, నవరాత్రి పూజలానే దీక్షగా చేయాలి. ఈ రెండింటికి ఓ సంబంధంముంది. అదేంటంటే.. రాత్రి సమయంలో పుట్టినందుకు రాత్రి సమయంలో తనకి పూజ జరిగేందుకు ఇవ్వమని సాక్షాత్తూ శివుడే అడగ్గా, అమ్మవారు అందుకు ప్రతిఫలంగా నవరాత్రుల పూజలు కోరుకున్నట్లు చెబుతారు. శివుడు అభిషేక ప్రియుడు, ఉపవాసం, జాగరణలను ఎంతగానో ఇష్టపడతాడు. అందుకే శివరాత్రి ముందురోజు నుంచే ఒక్కపూట భోజనం చేస్తారు. ఉదయం భోజనం చేయాలి.. లేదా సాయంత్రం భోజనం చేయాలి. అలాగే ఆరోజూ దీక్ష చెయ్యాలి అంటే బ్రహ్మచర్యం, నేలపై పడుకోవడం, సాత్విక ఆహారం తీసుకోవడం, ఒక్కపూట భోజనం, శారీరక, మానసికంగా శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులు నిందించడం వంటివి చేయనే కూడదు. ఉదయం పూజ చేసి మధ్యాహ్నాం, సాయంత్రం మరోసారి పూజ చేసి అర్ధరాత్రి వరకైనా అభిషేకం చేయాలి.

Image result for mahashivratri

ప్రతిజాముకి పూజ, అభిషేకం చేసి సూర్యోదయం అయ్యాక నిత్యకృత్యాలు చేసి సంధ్యావందనం చేసి అన్నీ రకాల పుష్పాలు, అన్నింటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి. అనంతరం బ్రహ్మణులు లేదా బంధుమిత్రులకు భోజనం పెట్టి మనం తీసుకోవాలి. ఇక మహాశివరాత్రి రోజున తప్పక చెయ్యాల్సింది జాగారం. జాగారం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. చాలా మంది జాగారం అంటే సినిమాలు గడుపుతూ ఉంటారు. కానీ ఆలా చేయకూడదు. జాగారం చేసే సమయంలో భక్తి మార్గంలో ఉండి దేవుని పారాయణలో గడపాలి. కాబట్టి భక్తి మార్గంలో జాగరణ చెయ్యండి. ఇలా చేస్తే అంత మంచే జరుగుతుంది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation