హెల్ప్ కోసం దొరబాబు ఫస్ట్ ఫోన్ రోజాకే చేశాడంట.. ఆమె రియాక్షన్ విని చెమటలు పట్టాయి..

96

తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇందులో ఎక్కువగా పాపులర్ అయ్యే స్కిట్ ఏదైనా ఉందంటే అది హైపర్ ఆది స్కిట్ అనే చెప్పుకోవాలి. హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే కామెడీ పంచ్ లు పేలిపోతాయి.. పొట్ట చెక్కలు కావాల్సిందే అంటారు. గత కొంత కాలంగా ఆయన కొంత మంది నటులను అనుకరిస్తూ కామెడీ చేస్తున్నాడు. హైపర్ ఆది టీమ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రైజింగ్ రాజు తర్వాత దొరబాబు. గతంలో దొరబాబు అడల్ట్ బీ గ్రేడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇదే ప్రస్తావన హైపర్ ఆది తన స్కిట్ లో దొరబాబు పై పంచ్ లు వేస్తుంటాడు. కానీ ఇప్పుడు రియల్ గా కూడా ఇదే పని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. విశాఖ పట్నంలోని వ్యభిచార గృహంలో జబర్ధస్త్ నటుడు దొరబాబు, పరదేశ దొరికిపోవడం సినీ, బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో మంగళవారం రాత్రి మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌ 201 ప్లాట్‌లో దాడులు నిర్వహించి ఇద్దరు మహిళలతో పాటు ఏడుగురు విటుల్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిలో జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశి ఉండడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. పరదేశి వీడియోలు తీయోద్దంటూ, తమను వదిలేయమంటూ పోలీసులను కాళ్లు పట్టుకుని మరీ బ్రతిమాలాడు. ఆ సమయంలో తమను వదిలేయాలని ప్రాదేయపడ్డట్టు సమాచారం. ప్రస్తుతం దొరబాబు, పరదేశిలు వ్యభిచార గృహంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Image result for dorababu roja

అయితే పోలీసులను ఎంత బ్రతిమలాడిన వదిలెయ్యకపోవడంతో చివరి ప్రయత్నంగా దొరబాబు, పరదేశిలు పోలీసుల చేత జబర్దస్త్ షో జడ్జి, ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేయించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజా చేత చెప్పిస్తే వింటారోమోనని పోలీసుల చేత ఆమెకు కాల్ చేయించగా రోజా ఫైర్ అయ్యిందంట. ‘ఇలాంటి విషయాల్లో తాను ఎటువంటి సహాయం చేయబోనని, పలుకుబడి చేత ఇలాంటి వాళ్లకి హెల్ప్ చేస్తే అది అలుసుగా తీసుకుంటారు.. ఒక మహిళగా ఇలాంటి పనులు చేసే వారిని నేను ప్రోత్సహించను. చట్టం ఎవరి చుట్టమూ కాదు.. మీ పద్ధతిలో మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. వాళ్ళను అరెస్ట్ చేసి కోర్ట్ కు పంపించండి. కోర్ట్ ఎలాంటి శిక్ష వెయ్యాలో అలంటి శిక్ష వేస్తుందని ’ రోజా పోలీసులకు చెప్పారని సమాచారం. దాంతో పోలీసులు కూడా ఇద్దరి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక వ్యభిచారం కేసులో ఇరుక్కోవడంతో దొరబాబు, పరదేశీ కెరీర్ లు డైలమాలో పడ్డాయి. వీళ్ళను జబర్దస్త్ నుంచి తీసేసే ఆలోచనలో ఉంది మల్లెమాల.

Content above bottom navigation