కట్నం కోసం పెళ్లి చేసుకోవడమే నా సమస్యకు పరిష్కారమా? మంచి సలహా ఇవ్వండి ప్లీజ్.!

నా పేరు భాను., డిగ్రీ పూర్తి చేశాను. కొన్ని రోజులు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను. నెల‌కు 20వేల జీతం వ‌చ్చేది. ఇంటి బాధ్య‌త అంతా నేనే చూసుకునేవాడిని అందుకు ఇంటికి నెల‌కు 10-12 వేల దాకా పంపేవాడిని.. జీతం స‌రిపోవ‌డం లేద‌ని …తెలిసిన వారి ద‌గ్గ‌ర 8 ల‌క్ష‌లు అప్పు చేశాను ఓ బ్యాంక్ లో లోన్ కూడా తీసుకొని , ఓ పార్ట‌న‌ర్ తో క‌లిసి మొబైల్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను…బిజినెస్ 1 నెల బాగానే న‌డిచింది. అంత‌లోనే కొరోనా వ‌చ్చింది

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

అప్పుకు వ‌డ్డీ క‌ట్టాలి…. బిజినెస్ జీరో అయ్యింది… ఆస్తులు లేవు..ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఈక్ర‌మంలో బిజినెస్ నుండి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది… అప్పు అలాగే ఉంది. EMI లు క‌ట్టాలి..ఇంట్లో వెళ్ల‌దీయాలి? అంతా పిచ్చిపిచ్చిగా ఉంది.

ఇదే ప్రాబ్ల‌మ్ ను ఫ్రెండ్ తో చెబితే….పెళ్లి చేసుకో అన్నాడు.. వ‌చ్చే క‌ట్నంతో అప్పుల‌ను తీర్చేసి…కొంత డ‌బ్బును బ్యాంకులో దాచుకుని ఏదో ఒక చిన్న‌పాటి ఉద్యోగం చేసుకోమ‌న్నాడు.

గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ నోటిఫికేష‌న్స్ వ‌చ్చిన‌ప్పుడు …ఆ ఉద్యోగాన్ని మానేసి బ్యాంకులో ఉన్న డ‌బ్బుల స‌హాయంతో మంచి కోచింగ్ సెంట‌ర్ లో జాయిన్ అయ్యి, జాబ్ కోసం ప్ర‌య‌త్నించ‌మ‌న్నాడు.

Content above bottom navigation