మళ్ళీ భూప్రకంపనలు..ఇళ్ళలోంచి బయటకి జనాలు పరుగులు

127

ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. గత నెల రోజులుగా ఢిల్లీలో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఓవైపు కరోనా వైరస్తో అతాలకుతలం అవుతున్న ప్రజలకు ఈ భూప్రకంపనలు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించాయని అధికారులు చెబుతున్నారు. నోయిడాలో దక్షిణ తూర్పున 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైంది. నోయిడాలో 3.8 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కాగా, గత నెల రోజులుగా భూప్రకంపలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. గత నెల రోజులుగా పలుమార్లు స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూప్రకంపనలు ఇంకా ఎన్ని రోజులుంటాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Content above bottom navigation