ఫేస్ బుక్ లో లవ్ .. అతనికోసం వేల కోట్లు వదిలేసింది.. వామ్మో సూపర్ లవ్ స్టోరీ .

145

ప్రేమ…రెండు అక్షరాలు…కాని లక్షణాలు మాత్రం లక్షల్లో ఉంటాయి. గాల్లో తేలిపోవడం, చందమామ ని అందుకోవడం…ఇలాంటివి ఎన్నో. పగలంతా ఊహల్లో, రాత్రంతా కలల్లో బతుకుతూ ఉంటారు. రోజుకి 24 గంటలు ఉన్నా ఇంకో గంట ఉంటె బాగుండు అనుకుంటారు లవర్స్. ప్రేమ ఎప్పుడు ఎవరికీ ఎవరి మీద పుడుతుందో తెలీదు. అలా ఒక కోటీశ్వరురాలు ఒక మధ్యతరగతి అతన్ని ప్రేమించింది. ప్రేమ కోసం మేము దేనినైనా వదులుకుంటాం, చివరికి నీ ఆస్థి కూడా వద్దు కానీ మాకు మా ప్రేమ కావాలి.. ఇలాంటి డైలాగ్స్ సినిమాలలో విని ఉంటారు కానీ రియల్ లైఫ్ లో ఇలా ఎవరైనా వదులుకుంటారా అంటే అస్సలు వదులుకోరు. కానీ మలేషియాకు చెందిన ఒక అమ్మాయి ప్రేమించిన వాడి కోసం తన కోట్ల రూపాయల ఆస్తిని వదులుకుంది.

Image result for angelina fransis khu

మలేసియాలో ఖూకే పెంగ్ బిజినెస్ టైకూన్. వేల కోట్ల రూపాయల వ్యాపారసామ్రాజ్యానికి అధినేత ఆయన, ఆయన భార్య మాజీ మిస్ మలేసియా పౌలిన్ ఛై. ఆ దంపతులకు ఐదుగురు సంతానం. అందర్లోకి చిన్న కుమార్తె ఏంజెలినా ఫ్రాన్సిన్ ఖూ. ఈమెకు ఫేస్ బుక్ లో జెడిడియా అనే ఫ్యాషన్ డిజైనర్‌ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త కొన్నిరోజులు ప్రేమగా మారింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడంతో ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పింది. ఏంజెలినా ప్రేమను ఆమె తల్లి అర్థం చేసుకుంది కానీ, కన్నతండ్రి ఒప్పుకోలేదు. చిన్నప్పటి నుంచీ ప్రేమగా పెంచిన కూతురుని ఆస్తి లేని ఒక వ్యక్తికి ఇవ్వడానికి ఆమె తండ్రి అస్సలు ఒప్పుకోలేదు. అతన్నే పెళ్లి చేసుకునేలాగా అయితే తన ఆస్తి లో రూపాయి కూడా ఇవ్వను అని తెల్చేసాడు ఆ తండ్రి. అయినా సరే నువ్వూ ఒద్దు నీ ఆస్తీ ఒద్దు అంటూ ఆమె పేరిట ఇప్పటికే రాసి ఉన్న దాదాపు ఐదు వేల కోట్ల ఆస్తిని వెనక్కి ఇచ్చేసి అతనికోసం వచ్చేసింది ఆమె.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రేమించినవాడిని పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్ళికి కేవలం ముప్పై మంది మాత్రమే హాజరు అయ్యారు. ఆమె తరఫువాళ్ళు ఎవ్వరూ రాకపోయినా ఆమె బాధపడలేదు. ఆమె జీవితం హాయిగా సాగిపోతుండగా, తన తల్లిదండ్రులు మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో వారు కోర్టు కెక్కారు. దీంతో న్యాయస్థానం విడాకులు మంజూరు చేసిన సందర్భంగా ఆస్తుల వాటాలు కోరింది. దీంతో ఏంజెలినాకు కూడా వాటాగా వేల కోట్ల రూపాయలు వచ్చాయి. అంత ఆస్థి ఉన్నా కూడా తన ప్రియుడికి నేను కోటీశ్వరురాలిని అని ఎప్పుడు చెప్పలేదు. పెళ్ళైన తర్వాత జరిగింది మొత్తం జెడిడియాకు తెలిసింది. అప్పటికి కానీ జెడిడియాకు తన భార్య ఎంత ధనవంతురాలో తెలియలేదు. తన కోసం అంత త్యాగం చేసిన భార్యను చూసుకుని ఇప్పుడు మురిసిపోతున్నాడు జెడిడియో. వీరి ప్రేమకథ ఈ మధ్యే వెల్లడికాగా.. వారి ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వారి ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిది నిజమైన ప్రేమంటూ ఆకాశానికెత్తెస్తున్నారు నెటిజన్లు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation