కన్న కొడుకును పెళ్లి చేసుకున్న మహిళ.. వైరల్ ఫోటో వెనుకున్న అసలు కథ తెలిస్తే షాక్

114

ఈ భూ ప్రపంచంలో ఏ తల్లి అయిన కన్నకొడుకును పెళ్లి చేసుకుంటుందా? అంటే అస్సలు చేసుకోదు. అలా చేసుకున్న సందర్బాలు ఇప్పటివరకు రాలేదు. ఒకవేళ అలా చేసుకుంటే ఈ సమాజం ఆమెను ఒక బరితెగించిన మహిళగా చూస్తుంది. అందుకే ఏ కన్నతల్లి కూడా బిడ్డను పెళ్లి చేసుకోలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెళ్లి చేసుకున్న తల్లీకొడుకులు అనే వార్త తెగ హల్చల్ చేస్తుంది. ఆ ఫొటోలో ఉన్నది నిజమైన తల్లికొడుకులే. కానీ ఆ ఫోటో వెనుక అసలు కథ వేరే ఉంది. ఆ కథ తెలిశాకా అయ్యో.. అంటూ నాలుక కర్చుకుంటున్నారు. మరి ఆ ఫోటో వెనుక ఉన్న అసలు కథ ఏంటో పూర్తీగా తెలుసుకుందామా..

Image result for కన్న కొడుకు పెళ్లి చేసుకున్న మహిళ..

సౌదీ అరేబియాకు చెందిన ఒక మహిళ భర్త చనిపోవడంతో తన సొంత కుమారుడినే పెళ్లి చేసుకుందని, దీనికి సంబంధించిన ఫొటో ఇదే అంటూ ఒక తల్లి, కొడుకు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో చూసినవాళ్లు ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేశారు. కొందరు అయితే భూతులు తిడుతూ కామెంట్స్ పెట్టారు. అయితే ఇలా నీచపు కామెంట్స్ పెట్టిన ఎవరికీ కూడా ఆ ఫోటో వెనుక ఉన్న అసలు కథ తెలీదు. ఇంతకు ఆ ఫోటో వెనుక కథ ఏమిటంటే.. ఆ ఇద్దరు నిజమైన తల్లికొడుకులే, కానీ వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోలేదు. ఈ ఫొటో వెనుక ఉన్న అసలు కథను మహ్మద్ జుబీర్ అనే ట్విట్టర్ యూజర్ వెల్లడించారు. ఈ ఫొటోపై సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న విషయం ఫేక్ అని జుబీర్ స్పష్టం చేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఈ ఫోటో వెనుక ఉన్న అసలు కథ గురించి అతను వివరిస్తూ… ఇస్లామిక్‌ క్యాప్షన్‌ తో ట్వీట్ చేసిన ఈ ఫొటో కోసం తాను సోషల్ మీడియాలో ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ చేసానని, జనవరి 31న ఈ ఫొటోలు ఒక ఫేస్‌బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసినట్టు గుర్తించాననీ మహ్మద్ జుబీర్ తెలిపారు. ఫేస్ బుక్ లో ఈ ఫొటోకు ఉర్దూలో “ఇవాళ నా కుమారుడు ఖురాన్ పఠనం పూర్తి చేశాడు” అని క్యాప్షన్ ఉన్నట్టుగా జుబీర్ గుర్తించారు. అంటే ఆ పిల్లాడు ఖురాన్ పఠించడాన్ని అందరికి తెలియాలని ఆ తల్లి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. దానిని ఎవరో ఇలా తప్పదుగా ప్రచారం చేశారని జబీర్ తన ట్విట్టర్ లో వెల్లడించారు. ఎవరో ఒక నెటిజన్ ఈ ఫొటోను తీసుకుని, ఓ నకిలీ ట్విట్టర్ అకౌంట్ లో ‘ సొంత కొడుకును పెళ్లాడిని తల్లి ‘ అంటూ తప్పుడు ప్రచారం చేశారని జూబిర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లీ బిడ్డల పవిత్రమైన బంధాన్ని ఇలా ప్రచారం చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఫొటోకు కామెంట్స్ పెట్టినవాళ్లు తప్పు చేశామని, క్షమించమని, తమ కామెంట్స్ ను డెలీట్ చేస్తున్నారు. చూశారుగా ఒక తల్లికొడుకు బంధాన్ని కూడా తప్పుగా ఎలా ప్రచారం చేశారో. ఈ విషయం మీద జూబిర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ ఫేక్ ట్విట్టర్ అకౌంట్ ఎవరిదో తెలుసుకునే పనిలో ఉన్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation