45 ఏళ్ళు వచ్చినా నగ్మా పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా? వాడుకొని వదిలేసిన హీరో ఇతనే..!

116

సుమన్ హీరోగా తెరకెక్కిన ’పెద్దింటి అల్లుడు’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నగ్మా. ఆ తర్వాత నాగార్జున తో ’కిల్లర్’ లో నటించింది. చిరంజీవితో ’ఘారానా మొగుడు’.. బాలయ్యతో ’అశ్వమేథం’.. వెంకటేష్ తో ’కొండపల్లి రాజా’ వంటి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

2009 వ సంవత్సరం వరకూ సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈ అందాల హీరోయిన్.. ఆ తర్వాత సినిమాలకు బై చెప్పేసింది. అయితే 45 ఏళ్ళ వయసు పై బడినా నగ్మా.. ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దానికకి ప్రధానమైన కారణం ఏంటన్నది చాలా మందికి తెలీదు.

అసలు విషయం ఏమిటంటే.. నగ్మా తెలుగుతో పాటు తమిళ,హిందీ, కన్నడ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించిన విషయం తెలిసిందే. ఆ టైంలోనే ఓ కోలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమలో పడిందట. అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుందట.

కానీ అతను నగ్మాకు కాదని మరో హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇండియన్ మాజీ క్రికెటర్ గంగూలీని కూడా ప్రేమించిందట. ఇద్దరూ పెళ్ళి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారట. అయితే కుటుంబ పరిస్థితుల రీత్యా వీళ్ళకి కొన్ని బాధ్యతలు ఏర్పడడంతో విడిపోయారు అని నగ్మనే స్వయంగా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. పెళ్ళి పై అభిప్రాయం మార్చే వ్యక్తి దొరికితే.. అతనితో జీవితాంతం సంతోషంగా ఉండగలను అని నమ్మకం కలిగితే పెళ్లి చేసుకుంటానని నగ్మా చెబుతోంది.

Content above bottom navigation