మన దేశంలో దేవుళ్ల కంటే దొంగబాబాలనే ఎక్కువ నమ్ముతారు
వారు చెప్పిందే వేదంగా భావిస్తారు
దేవుడి హుండీలో కాకుండా దొంగబాబాల హుండీలో జనాలు డబ్బులు వేస్తారు
రోజుకో బురిడీ బాబా దొరుకుతున్నా ఈ ప్రజలు మరింత అమాయకంగా వారినే నమ్ముతారు.
మేము కాలితో తన్నితే మోక్షం
మా చేయి వేస్తే జబ్బులు మాయం
తీర్దం తీసుకుంటే దీర్ఘాయుష్యు ఇలాంటి చిడత మర్మాలు చెబుతారు ఈ బురిడీ బాబాలు
తాజాగా అలాంటి ఓ బాబా దొంగ లీలలు బయటపడ్డాయి
ఇంతకీ ఇతను చేసిన నీచపు పనికి చివరకు పోలీసులు అతన్ని జైల్లో పెట్టారు
ఇంతకీ ఈ బురిడీ బాబా కొత్త అవతారం ముసుగులో ఏం చేశాడో చూద్దాం
స్వయం ప్రకటిత భగవాన్‌గా చెప్పుకునే దొంగబాబా 10-19 ఏళ్ల మధ్య వయస్సున్న ఐదుగురు అక్కాచెల్లలపై అత్యాచారం చేసి.. ఆపై లైంగికంగా వేధించినందుకు పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు జరిగింది ఏమిటి అంటే..పింప్రి చించువాడ్లో నివాసముంటున్న బాధితురాళ్లను గర్భం దాల్చకుండా ఎవరో చేతబడి చేశారని, దీనికి విరుగుడిగా ఇంట్లో ఓ ఆచార కర్మ నిర్వహించాలని, ఇంట్లో దాచిన నిధిని కూడా బయటకు తీసేందుకు సాయం చేస్తానని వారిని నమ్మించాడు
బాధిత యువతులపై అత్యాచారం చేయడమే కాకుండా లైంగికంగా వేధిస్తున్నాడు. దీనిపై ఎవరికైనా చెబితే మీ అమ్మాయిలను చంపేస్తానంటూ వారి తల్లిదండ్రులను కూడా బెదిరించాడు. ఐదుగురిలో ఒకరిని దొంగ పెళ్లి కూడా చేసుకున్నాడు.దీనిపై ఆ ఐదుగురిలో పెద్ద అక్క పోలీసులకు వీడి బాగోతం మొత్తం చెప్పింది..
తన సోదరీలు గర్భం దాల్చకుండా ఎవరో తమ కుటుంబంపై చేతబడి చేశారని సోమనాథ్ మమ్మల్ని నమ్మించినట్టు ఫిర్యాదులో తెలిపింది. అంతేకాదు.. మీ సోదరీల్లో ఒకరు ప్రమాదంలో ఉన్నారని, వారిని రక్షించాలంటే తప్పనిసరిగా ఇంట్లో ఓ ఆచార కర్మను నిర్వహించాలని రాత్రి మా ఇంట్లో ఇలాంటి దుర్మార్గం చేశాడు అని అక్కడ పోలీసులకు వివరంగా చెప్పింది. అంతేకాదు దీనికోసం మూడు లక్షలు డిమాండ్ చేశాడట.

వెంటనే నిందితుడు సోమనాథ్ చావన్ ను పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసినట్టు పోలీసు అధికారి తెలిపారు. ఆమె అక్కతో పాటు మహారాష్ట్ర అంధాశార్దా నిర్మూలన్ సమితికి చెందిన సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చూశారుగా ఇలాంటి బురిడీ బాబాలు చాలా మంది ఉంటారు వారిని నమ్మకండి, ఈరోజుల్లో శక్తులు దెయ్యాలు భూతాలు ఇలాంటివి చెప్పి అడ్డంగా ముంచుతున్నారు జర జాగ్రత్త.