హైదరాబాద్ మేడ్చల్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న రైలు నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో పలు బోగీలు దగ్దం అయ్యాయి. రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. అయితే ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగిందా లేక మరో కారణమా అనేది తెలియాల్సి ఉంది.