50 సంవత్సరాల పాటు చైన్ తో కట్టిపడేసారు .. చివరికి విడుదల చేయగానే

131

ఫ్రెండ్స్ ఈ ప్రకృతి సృష్టించిన జీవుల్లో మానవుడు ఎంతో తెలివైన మరియు శ్రేష్టమైన జీవి..కాని ఒక్కోసారి ఈ మానవుడు తన స్వార్దానికి చేసే కొన్ని పనుల వలన ఆ ఈశ్వరుడు కూడా తన సృష్టి పట్ల తానే అవమానంగా ఫీలవుతాడు కావొచ్చు.. మీరు చూస్తున్న ఈ ఫోటో భయంకరమైన నరకాన్ని అనుభవించిన కృరత్వానికి సహించిన ఒక నోరులేని అమాయక ఏనుగు కాళ్ళ ఫోటో..అది కూడా 50 సంవత్సరాలపాటు…చివరిగా రెస్క్యూ ఆపరెషన్ చేసి ఈ ఏనుగును విడిపించగానే వాస్తవంగా దాని కంట్లో నుంచి కన్నీళ్ళు వచ్చాయి..ఈ రోజు మనం తెలుసుకోబేయే ఈ వాస్తవిక ఘటన మరెక్కడదో కాదు..మన భారత దేశం లోనిదే..ఈ ఘటనలో రాజు అను పేరుగల ఏనుగును 50 సంవత్సరాలపాటు నరకంతో కూడిన జీవితాన్ని గడిపాక ఒక రోజు అర్దరాత్రి రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడారు..రాజు అనే ఈ ఏనుగు ఎక్కడ పుట్టిందో తెలీదు..కానీ దాని తలరాత మొదటి నుండి చాలా ఘోరంగా ఉంది..రాజు పుట్టగానే ఆ చిన్నతనంలోనే ఎవరో రాజుని అడవి నుంచి దొంగిలించి అమ్మేసారు..ఇక ఆ తరువాత ఈ అమ్మకాల పరంపర ఆగలేదు..ప్రతీ రెండు మూడేళ్ళకు రాజు ఓనర్ మారిపోతూ ఉండేవాడు..ఈ మనుషులు రాజుని ఒక నోరులేని జంతువులా కాకుండా డబ్బులు సంపాదించే ఒక యంత్రంలా భావించారు..

చివరికి ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామానికి తీసుకువచ్చి రాజుని అక్కడొక వ్యక్తికి అమ్మేసారు..దురదృష్ట వశాత్తూ రాజు యొక్క ఈ కొత్త యజమాని అన్ని చెడు వ్యసనాలకు బానిస..మొదట్లో రాజుని ఆ వ్యక్తి పర్యాటక స్థలాలకు తీసుకొని వెళ్ళేవాడు..అక్కడ రాజు యొక్క ఆటలు చూసి జనం డబ్బులు ఇచ్చేవారు..అంతే కాదు టూరిస్టులు రాజుపైన సవారీ చేసినందుకు దాని యజమానికి బాగానే డబ్బులు వచ్చేవి..కానీ మందుకు బానిస అయిన ఆ వ్యక్తి మాత్రం ఏ రోజు రాజుకి కడుపు నిండా తిండి పెట్టేవాడు కాదు.. వచ్చిన డబ్బంతా వాడి తాగుడికి వ్యసనాలకే సరిపోయేది..పొద్దుట నుంచి సాయంత్రం వరకూ దాంతో పని చేయించుకొని సాయంత్రం పూట తిండి కోసం వీధుల్లో వదిలేసే వాడు.. ఆకలికి తట్టుకోలేక రాజు వీధుల్లో ఏది దొరికితే అది తినేది..సరైన ఆహారం లేక రాజు కొన్నాళ్ళకు అనారోగ్యం పాలయింది..దాంతో రాజు యొక్క యజమాని దాన్ని ఇంటి వెనుక పెరట్లో కట్టేసాడు…రాజును పదునైన ముళ్ళలా ఉన్న ఇనప గొలుసులతో కట్టేసేవాడు..మీరు నమ్ముతారో లేదో కాని రాజు మాత్రం 50 సంవత్సరాలపాటు తన యజమాని యొక్క ఈ అరాచకాన్ని భరించింది..తాగిన మత్తులో తనకు ఉపయోగపడకుండా పోయిందని రాజును చితక బాదేవాడు..మీరు ధ్యాస గా చూసినట్టయితే రాజు కాళ్ళపై 50 ఏళ్ళుగా ఉన్న తుప్పు పట్టిన ఆ ఇనుప గొలుసుల యొక్క గుర్తులు కూడా చూడవచ్చు..

Image result for elephant raju

2013 లో భారత్ లోని వైల్డ్ లైఫ్ చారిటీ సంస్థకు రాజు పై జరుగుతున్న ఈ పాశవిక దాడి గురించిన సమాచారం అందింది..రాజును రెస్క్యూ చేసేందుకు ప్లాన్ తయరుచేయడానికి ఆ టీం కి ఒక సంవత్సరం పట్టింది..2013 జూలైలో రాజు పరిస్థితి గురించి జనం ముందుకు వచ్చినపుడు అది విని కన్నీరు పెట్టని వారు లేరు..ఎండా వాన అని లేకుండా రాజును ఓపెన్ ప్లేసులో కట్టి పడేసారు..రాజు పేరు చెప్పుకొని దాని ఓనర్ పగటిపూట డబ్బులు వసూలు చేసేవాడు..రాజుకి కడుపు నిండా తిండి పెట్టట్లేదని దాని పరిస్థితి చూస్తే ఎవరికైనా అర్దం అవుతుంది..టూరిస్ట్ ప్లేస్ కావడంతో ఆ చుట్టుపక్కలకు తిరగడానికి వచ్చిన వారు రాజుకి తినడానికి ఏమైనా పెడుతూ ఉండేవారు..2013 లో రాజును విడిపించడానికి రెస్క్యూ టీం వారు కోట్ ను ఆర్డర్ అడిగితే ఆ ఆర్డర్ రావడానికి సంవత్సరం సమయం పట్టింది..ఇక 2014 లో ఆర్డర్ రావడంతోనే శ్రీ కార్తీక్ సత్యన్నరాయణ నేతృత్వంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసారు..రాజు కాళ్ళకు కట్టిన గొలుసులను తీయడానికి చాలా కష్టమయింది..ఎందుకంటే ఆ చైన్లు తీసే క్రమంలో అవి గుచ్చుకొని రాజు చాలా బాధ పడేది…

ఈ క్రింది వీడియోని చూడండి

చాలా కాలం తరువాత చైన్లను విప్పారు..కానీ ఆ సమయంలో రాజుకి లేచి నిల్చొడానికి కూడా బలం లేదు..ఏలాగైతెనేం అందరినీ చూసి మెల్లగా కాసేపటికి ధైర్యం తెచ్చుకొని నిలబడింది..రాజుకి అక్కడే కడుపు నిండా తిండి పెట్టారు..తిండి తింటూనే రాజు అందరి ముందు కంట తడి పెట్టింది..దీంతో ఇది చూసిన వారందరు కూడా వారి దుఖాన్ని ఆపుకోలేకపోయేవారు.. రాజుకు ఒక హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేసేవారు..ఆ తరువాత రాజు ఆరోగ్యం బాగయ్యాక పచ్చటి అడవిలో దాని స్నేహితుల మధ్య వదిలేసారు..జంతువులకు తమ బాధలను చెప్పుకునేందుకు ఎవరూ లేకపోవచ్చు..కాని వాటిక్కూడా మనలాగ మనసు ఉంటుంది..మనలాగ పెయిన్ కూడా ఉంటుంది..ఈ విషయాన్ని ప్రతీ ఒక్క మనిషి గ్రహించాలి… ఈఎ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation