తండ్రి మృత దేహం వద్ద అమృత చేసిన పనికి అందరూ షాక్

386

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. మారుతీ రావు మృతి మిస్టరీగానే మిగిలింది. వ్యాపారవేత్త మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. స్మశాన వాటికకు పెద్దఎత్తున మారుతీరావు కుటంబసభ్యులు, స్నేహితులు చేరుకున్నారు. తమ్ముడు శ్రవణ్ అన్న చితికి నిప్పంటించారు.

Image result for amrutha pranay

ఇదిలా ఉంటే అమృత పోలీసుల భద్రత మధ్య తండ్రి అంత్యక్రియలకు వెళ్లారు. తండ్రిని చివరి చూపు చూసేందుకు శ్మశానం దగ్గరకు వెళ్లగా, ఆమెను బంధవులు అడ్డుకున్నారు. అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.. దీంతో శ్మశానం దగ్గర ఉద్రిక్త పరిస్థితుల ఏర్పడ్డాయి. తన తండ్రిని కడసారి చూడకుండానే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే స్మశాన వాటికలో అమృత చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు.

తండ్రిని చూడటానికి వచ్చిన అమృతను కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఆమె దూరం నుంచే తండ్రికి నివాళులు అర్పించింది. అంతేకాదు ఒక్కసారిగా గట్టిగా ఏడ్చింది. ఎందుకిలా చేశావు. నా భర్తను చంపావు. ఇప్పుడు నువ్వు చనిపోయావు. ఏం సాదించావు. నాకు ఎవరు లేకుండా చేశావు. నన్ను ఒంటరిదానిని చేశావు. నీ కడుపులో పుట్టడమే నేను చేసిన తప్పా. లోకం దృష్టిలో నువ్వు చెడ్డవాడివి అయ్యావు.

Image result for amrutha pranay

ఇప్పుడు నువ్వు చనిపోయి నన్ను చెడ్డదానిని చేశావు. ఇక నేను ఈ లోకంలో ఎలా తలెత్తుకుని తిరగాలి. నేనేం పాపం చేశాను అని అమృత ఏడుస్తూ గట్టిగా అరిచింది. అంతేకాదు తండ్రి మృతదేహం వద్దకు తనను రానివ్వకపోవడంతో దూరం నుంచే పూలు చల్లి అతని మృతదేహానికి నివాళులు అర్పించింది. అమృత ఇలా బిహేవ్ చెయ్యడం చూసి అక్కడ ఉన్న పోలీసులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. మారుతీరావు కోసం అమృత ఇలా ఏడవడం ఇదే మొదటిసారి. నిన్న తండ్రి చనిపోయాడు అని తెలిసిన కూడా ఆమె కంట్లో ఒక్క కన్నీటి చుక్క రాలలేదు. చనిపోయిన వ్యక్తి ఎవరో తనకు తెలియనట్టే మీడియా ముందు బిహేవ్ చేసింది. కానీ ఇప్పుడు ఇలా స్మశాన వాటికకు వచ్చి తండ్రి కోసం కన్నీళ్లు పెట్టుకుంది.

మరోవైపు మారుతీరావు మృతి మిస్టరీగా మారింది. ఆయన మృతిపై పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. ఆయనది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికైతే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కేసుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రణయ్‌ని హత్య చేసినందుకు పశ్చాత్తపం చెందాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇక అతను ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లేమీ గదిలో లభించలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన సూసైడ్ చేసుకున్నట్లు చెబుతున్నా, అందుకు సంబంధించిన ఆధారం దొరక్కపోవటం ఇప్పుడు కొత్త అనుమానాలకు తెర తీస్తోంది.

Image result for amrutha pranay

ఆర్యవైశ్య భవన్ లోని రూంలోకి వెళ్లిన తర్వాత గారెలు తెప్పించుకు తిన్న మారుతిరావు, కాసేపటికే వాంతులు చేసుకున్నట్లుగా బెడ్ పక్కన ఉన్న రక్తపు వాంతుల్ని చూస్తే అర్థమవుతుంది. గారెలు తిన్నంత మాత్రాన ఎవరూ చనిపోరు. అలా అని గారెల్లో విషం కలుపుకు తిన్నారా? అంటే.. దానికి సంబంధించిన బాటిల్ కానీ ప్యాకెట్ కానీ దొరకలేదు. ఆ బాటిల్ ఎక్కడ ఉంది అన్నది మరో ప్రశ్న తలెత్తుతుంది. విషం తీసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటారన్న దానికి తగ్గ ఆధారం లభించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికైతే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation