పూలమ్మే మహిళ అకౌంట్ లో రూ.30 కోట్లు.. ఎలా వచ్చాయో తెలిసి షాకైన పోలీసులు

ఎలా వచ్చాయి ? ఎవరు వేశారు ? ఎందుకు వేశారు ? ఇవేవీ తెలియదు. ఓ మహిళ అకౌంట్లో రూ. 30 కోట్లు జమ కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక వార్త హల్ చల్ చేస్తోంది. సాధారణంగా తోపుడు బండ్లపై పూలు అమ్ముకునేవారికి రోజు ఎంత వస్తుంది? మహా అయితే ఐదారు వందల రూపాయలు వస్తాయి. ఏ రోజూ వచ్చిన డబ్బు ఆరోజే ఖర్చు అయిపోతాయి కూడా. ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళ ఇంట్లో ఆ డబ్బు ఎందుకు సరిపోదు. ఒకవేళ వాళ్ళు ఆదా చేసిన కూడా, వారి బ్యాంక్ అకౌంట్లో రూ.50వేలు లేదా రూ.లక్షకు మించి ఎక్కువ డబ్బులు ఉండవు. కానీ పూలు అమ్మే ఒక మహిళ అకౌంట్లో ఏకంగా రూ.30 కోట్లు నగదు జమైంది. తమ అకౌంట్లో అంత డబ్బు చూసి దంపతులు షాకయ్యారు. ఈ డబ్బు తమది కాదని.. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కర్నాటకలోని చెన్నపట్నలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

బుర్హాన్ అలియాస్ ఇమ్రాన్…రీహానా బాను దంపతులు చెన్నపట్నంలో నివాసం ఉంటున్నారు. వీరు పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. 2015లో జన్ ధన్ యోజన పథకంలో భాగంగా రెహానా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జీరో అకౌంట్ ఓపెన్ చేసింది. ఖాతా ఐతే తెరిచింది కానీ అందులో ఎప్పుడూ డబ్బులు జమచేయలేదు. గత ఏడాది డిసెంబరు 5న బ్యాంకు అకౌంట్లోకి భారీగా డబ్బు జమ కావడంతో బ్యాంకు అధికారి రెహానా ఇంటికి వచ్చారు. బ్యాంకు అధికారులు రెహానా ఇంటికొచ్చి, మీ అకౌంట్లో రూ.29.90 కోట్లు జమ అయ్యాయని, ఆధార్ కార్డు, పార్డ్ చూపించాలని అడిగారు. బ్యాంకుకు వచ్చి డబ్బును తీసుకోవాలని చెప్పారు. దాంతో రెహానా, ఇమ్రాన్ దంపతులు బ్యాంకుకు వెళ్లారు. ఐతే అక్కడ బ్యాంకు అధికారులు షాక్ ఇచ్చారు. మీకు జీరో అకౌంట్ అని, ఎలాంటి డబ్బు రాలేదని చెప్పారు. జస్ట్ ఇక్కడ సంతకం పెడితే చాలని చెప్పి, ఏవేవో పేపర్లు ఇచ్చారు. రెహానాకు అనుమానమొచ్చి సంతకం పెట్టేందుకు నిరాకరించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఈ కేసు దర్యాప్తులో రెహానా దంపతులు కీలక వివరాలు చెప్పారు. గతలో ఎవరికైనా బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చారా? అని పోలీసులు అడగడంతో పూస గుచ్చినట్లు వివరించారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం.. వీరు గతంలో ఓసారి ఆన్‌లైన్లో చీరను ఆర్డర్ చేశారు. అనంతరం ఢిల్లీ నుంచి ఓ వ్యక్తి కాల్ చేసి.. మీరు కారు గెలుచుకున్నారని, ఇన్సూరెన్స్ కింద రూ.6 లక్షలు డిపాజిట్ చేయాలని కోరాడు. తాము పేదోళ్లమని.. కారు అవసరం లేదని, దానికి బదులు డబ్బు ఇవ్వాలని చెప్పారు. ఐతే వారి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించిన తర్వాత.. మళ్లీ అతడు కాల్ చేయలేదుు. అనుమానమొచ్చి ఏటీఎంకు వెళ్లి చెక్ చేస్తే…అకౌంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి. దీనిపై బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రెహానా దంపతులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే డబ్బులేసిన అజ్ఞాత వ్యక్తి మళ్లీ కాల్ చేసి రూ.15 కోట్లు మీరే పెట్టుకొని.. మిగతా రూ.15 కోట్లు మాకివ్వాలని అడిగినట్లు పోలీసులకు చెప్పారు రెహానా దంపతులు. ఈ కేసుపై రామనగర జిల్లా ఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ మోసగాళ్లు జీరో అకౌంట్ హోల్డర్స్‌ని టార్గెట్ చేసి.. జన్‌ధన్ ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారని భావిస్తున్నారు. రెహానా ఖాతాలో డబ్బు చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation