ఈ తప్పులు చేస్తే మీరు ఇంట్లో వున్నా కరోన వస్తుంది ఈ 9 నియమాలు పాటిస్తే మనం సేఫ్

భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే . దీంతో ప్రజలంతా అప్రమత్తమై వారి ఇళ్లలోనే ఉంటూ అత్యవసరమైన పరిస్థితిలో తప్ప బయటకు రావడం లేదు . పోలీసు వారు కూడా చాలా నిబద్ధతతో అనవసరంగా బయట కనిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉండడం చాలా ప్రశంసనీయం . అయితే తాము ఇళ్లలో ఉన్నాం కాబట్టి తమకు ఇక వైరస్ బెడద తప్పింది అని అనుకుంటే మాత్రం అది ముమ్మాటికీ పొరపాటే అవుతుంది .

ముఖ్యంగా చెప్పాలంటే బయట ఉన్న వారితో సమతూకంగా ఇంటిలో ఉన్న వాళ్లకు కూడా ఈ కరోనా మహమ్మారి సోకే ప్రమాదం పొంచి ఉంది . ప్రభుత్వాలు ప్రజలను బయటకు ఎందుకు రావద్దు అని అంటున్నారు అంటే బయట వైరస్ సోకిన వారి నుండి వారు నేరుగా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఇది మరీ ఎక్కువ మందికి ఊరికే సోకే అవకాశం ఉన్నందున . అలా అని మీరు ఇంట్లో ఉన్నా కూడా ఈ వైరస్ బెడద నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు .

అయితే ఈ తరుణంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి వైరస్ బారిన పడే చాన్సు అసలు లేదు . ఇంతకీ విషయం ఏమిటంటే ఇంటిలో ఉన్న సమయంలో నిత్యావసర వస్తువులు నిమిత్తం బయటికి వెళ్లి వచ్చిన తర్వాత మరియు ఇంటికి తెప్పించుకునే కొన్ని వస్తువుల ద్వారా వైరస్ సోకే అవకాశం ఉంది . ఇలాంటి నేపథ్యంలో దాని బారి నుండి తప్పించుకోవాలంటే పాటించాల్సిన సూచనలు ఇవే .

1. బయట నుంచి తీసుకొచ్చిన వస్తువులను నేరుగా తాకకుండా చేతులకు శానిటైజర్ రాసుకుని పట్టుకోండి .

2. అలాగే పాల ప్యాకెట్లను , కూరగాయలను , ఫ్రూట్స్‌ని శుభ్రంగా కడిగిన తరువాత చేతులను కూడా శుభ్రం చేసుకోవాలి .

3. ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న తరుణంలో దినపత్రికలను రద్దు చేయడం మంచింది .

4. కొరియర్స్ , ఇతరత్రా వాటికి ఇంటి బయట ఒక ట్రే ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి .

5. పని మనుషులకు నిర్భంద కాలం తప్పదు .

6. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అసలే వద్దు .

7. మొబైల్ ఫోన్లు , రిమోట్ కంట్రోల్ , కీ బోర్డ్స్ తరుచూ శుభ్రం చేసుకోవాలి .

8. అత్యవసరంగా బయటకు వెళ్లి వస్తే .. వెంటనే స్నానం చేయాలి .

9. ఇక వృద్ధులు ఈ కాలంలో వాకింగ్‌లకు వెళ్లకపోవడమే మంచిది .

Content above bottom navigation