Breaking News: కరోనా సోకి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మృతి..

72

చైనా దేశంలో పుట్టిన వైరస్ చాలా వేగంగా అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటికే 208 దేశాలకు పైగా వైరస్ కేసులు నమోదు కావడంతో ప్రపంచ జనాభా అంతా జంకుతున్నారు. ఈ వైరస్ కు నువ్వు నేను.. చిన్నోడు పెద్దోడు.. పేదోడు ధనికుడు అనే తేడా తెలియదు. అందరికీ సోకడమే.. సోకిన వాళ్లు సరైన వైద్యం తీసుకోకపోతే పైకి వెళ్లడమే. ఇప్పటికే లక్షల మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. కొందరు సెలబ్రిటీలకు కూడా ఇది సోకింది. ముఖ్యంగా హాలీవుడ్‌ లో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా వైరస్ బారిన పడ్డారు. ఇక ఈ మహమ్మారి కారణంగా పాకిస్థాన్ కి చెందిన స్వ్కాష్ ప్లేయర్ అజామ్ ఖాన్ ఇటీవల మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఇప్పుడు మరో ఆటగాడు దీని కారణంగా మృతి చెందాడు. ఈ ఘటనకు సంబందించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న శృతి హాసన్ పిక్స్

Former Pakistan cricketer Zafar Sarfaraz dies of coronavirus, Flash: కరోనా సోకి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మృతి..

1988-94 మధ్యకాలంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన జాఫర్ సర్ఫరాజ్ వైరస్ బారిన పడి మృతి చెందాడు. అతని వయస్సు 50 ఏళ్లు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయిన అక్తర్ సర్పరాజ్ సోదరుడు జాఫర్ సర్పరాజ్. ఈ నెల 7న జాఫర్ సర్ఫరాజ్ కి వైరస్ పాజిటివ్ అని తెలియడంతో ట్రీట్ మెంట్ కోసం ఆసుపత్రిలో చేరాడు. అయితే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో గత మూడు రోజుల నుంచి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తుండగా ఈ రోజు చివరి శ్వాస విడిచాడు. అయితే వైరస్ కారణంగా మృతి చెందిన తొలి ప్రొఫెషనల్ క్రికెటర్ జాఫర్ సర్పరాజ్ కావడం గమనార్హం. ఇతను పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించినప్పటికీ.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రం ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 1988 నుంచి 94 వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తన సత్తా చాటుతూ రికార్డులను కొల్లగొట్టాడు జాఫర్ సర్ఫరాజ్. ఇక 1994 లో క్రికెట్ కు పూర్తిస్థాయి వీడ్కోలు పలికాడు.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ కృతి కర్భంద

పాకిస్థాన్ లో కూడా ఈ మహమ్మారి ప్రభావం రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం అక్కడి ప్రభుత్వం కూడా సరైన నివారణ చర్యలు తీసుకోకపోవడంతో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అంతకంతకూ పెరుగుతోన్న వైరస్ పై ప్రభుత్వాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు నివేదిక కోరింది. ఈ సందర్బంగా ప్రస్తుత ఏప్రిల్ నెల చివరి వారం నాటికి పాకిస్తాన్‌లో వైరస్ బాధితుల సంఖ్య యాభై వేలకు చేరుకుంటుందని పాకిస్తాన్ ప్రభుత్వం దేశ సుప్రీంకోర్టుకు తెలిపింది. వైరస్ కు వ్యతిరేకంగా మీడియా సహాయంతో భారీగా ప్రజల్లో అవగాహన ప్రచారం జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలిపింది. విమానాశ్రయాలలో దిగ్బంధ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేసింది.

Content above bottom navigation