వైన్ షాపులు రీఓపెన్ ఉదయం 10 నుంచి 5 వరకు

ప్రస్తుతం భారతదేశంలో లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా రాష్ట్రాల ఒకింత ఆదాయం భారీగానే పడిపోతుంది. అలాగే అటు ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. ఈ పరిస్థితులలో మద్యం షాపులను తెరిచే ఆలోచన చేస్తున్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. నిజానికి కొంతమంది జనాలకు మద్యం లేక పిచ్చి ఎక్కుతుంది. అయితే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు అయిన అసోం, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అక్కడ మద్యం షాపులను కొంతసేపు మేర తెరవాలని భావిస్తున్నాయి.

సెగలు పుట్టించేలా నిక్కీ తంబోలీ అందాలు..

అయితే నేటి నుంచి మద్యం షాపులను తెరవాలని వారు భావిస్తున్నారు. ఇక ఉదయం 10 గంటల నుంచి ఏకంగా సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులను తెరిచే యోచనలో ఉన్నారు అక్కడ. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మేఘాలయా, అసోం రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు ఉంటాయని అక్కడి ప్రభుత్వం తెలిపింది.అయితే అసోం రాష్ట్రములో ఈ నెల 17 వరకు అమ్ముతుండగా, అలాగే మేఘాలయా రాష్ట్రములో మాత్రం ఏ తేదీని ప్రకటించలేదు. అయితే ఆ రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి కొంతమేర చాలా దారుణంగా ఉండటంతో ఈ నిర్ణయాన్ని అక్కడి ప్రభుత్వం తీసుకున్నారు.

Content above bottom navigation