బాయ్ ఫ్రెండ్ చనిపోయిన రోజు అతడితో ఆపని.. ఎలా సాధ్యం?

99

ఇతనిది స్టూడెంట్ నంబర్ 1 కథ… హత్య కేసులో జైలుకెళ్లి డాక్టరయ్యాడు

కలం పట్టిన చేతితోనే కత్తి పట్టాడు. ప్రాణం పోసే వృత్తి చేపట్టాల్సిన వాడు ప్రాణం తీశాడు. మెడలో స్టెతస్కోప్ వేసుకునే చేయికి బేడీలు వేసుకుని జైలుకెళ్లాడు. రోగుల చేయి పట్టి నాడీ చూసే సమయంలో జైలులో ఊచలు లెక్క పెట్టాడు. అయినా, లక్ష్యాన్ని మార్చుకోలేదు, గమ్యాన్నీ వీడలేదు. అటు కన్నవారికి ఇటు కలిసి తిరిగిన వారికి షాకిచ్చినా మళ్లీ ఆశయం వైపు కదిలాడు. ఎక్కడ జీవితాన్ని చీకటి మయం చేసుకున్నాడో అక్కడికే వచ్చి నిలబడ్డాడు. 14 ఏళ్లు జైల్లో ఉన్నా మళ్లీ ప్రాణం పోసే వృత్తిలోకే వచ్చాడు. మర్డర్ చేసిన చేతులతోనే డాక్టర్ పట్టా పొంది ప్రజల్లోకి వచ్చి వైద్యం చేస్తున్నాడు ఒక డాక్టర్. అతని కథేంటో ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

ఈ క్రింది వీడియోని చూడండి

అది 1997వ సంవత్సరం. కర్ణాటకలోని అఫ్జల్‌పురాకు చెందిన సుభాష్ పాటిల్, కలాబురాగి జిల్లాలోని ఎంఆర్‌ మెడికల్‌ కాలేజీలో పాటిల్‌ MBBS మూడో సంవత్సరం చదువుతున్నాడు. చదువు తప్ప వేరే ఏ ధ్యాసా లేకుండా ఉండేవాడు. డాక్టర్ కావాలని బలమైన కోరిక ఉండేది. కానీ ఓ అనూహ్య పరిస్థితిలో కసితీరా ఓ హత్య చేశాడు. చదువుకునేటప్పుడు ఇతను పద్మావతి అనే మహిళ ఇంటి పక్కనే నివసిస్తుండేవాడు. ఈ క్రమంలో పద్మావతి, పాటిల్‌ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే అప్పటికే పద్మావతికి, అశోక్‌కు వివాహమైంది. అయినప్పటికీ పాటిల్‌ తో పద్మావతి చనువుగా ఉంటూ శారీరకంగా దగ్గరైంది. విషయం తెలుసుకున్న అశోక్‌, తన భార్యతో పాటు పాటిల్‌ను మందలించాడు. తన భార్య వద్దకు వస్తే చంపేస్తానని సుభాష్‌ ను బెదిరించాడు అశోక్‌. చివరకు అశోక్‌నే పాటిల్‌, పద్మావతి కలిసి చంపేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో పాటిల్‌.. ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ కేసులో పద్మావతిని, పాటిల్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరిద్దరికి కోర్టు జీవిత ఖైదు విధించింది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation