గోవా వెళ్ళే వారికి షాకింగ్ న్యూస్

806

గోవా..ఈ పేరు చెబితే చాలు.. మందుబాబుల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇక్కడ లిక్కర్ చాలా చీప్. అంతేకాదు.. అటు బీచ్‌లలో ఎంజాయ్ చేస్తూ.. పూర్తిగా విదేశాలకు వెళ్లిన అనుభూతి కలుగుతుందన్న ఆశతో.. గోవా టూర్ అంటే.. అంతా రెడీ అంటారు. అయితే ఇప్పుడు అక్కడి గోవా సర్కార్ మందుబాబులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. ఎందుకు అంటే గోవా టూర్ కి వెళ్ళే చాలా మంది ఎక్కువగా మద్యంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే బీచ్ లోనే కాకుండా హోటల్స్ లో కూడా మందు కిక్ ఉంటుందని, తక్కువ ధరకే మద్యం వస్తుందని, ఎంతైనా తాగొచ్చు అంటూ పర్యాటకులు భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా యూత్ సొంత ఊర్లలో తాగలేని వారు గోవా వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు…ఇక గోవాకి వెళ్లి మందు తాగుతూ ఎంజాయి చేద్దామనుకునే వారు.. ఇంతకు ముందులా ఎంజాయ్ చెయ్యలేరు. ఎందుకంటే.. ఇప్పటి వరకు చాలా తక్కువ ధరకు లభించిన మందుపై భారీగా ట్యాక్స్ ల్ని పెంచింది అక్కడి సర్కార్.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇప్పుడు గోవా ప్రభుత్వం ఊహించని విధంగా షాక్ ఇవ్వ‌డంతో మందు బాబులు షాక్ అవుతున్నారు. మద్యం ధరలను అమాంతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. 20 శాతం నుంచి 50 శాతం వరకు పెంచుతున్నామని గోవాలోని బిజెపి సర్కార్ ప్రకటించడం గోవా టూర్ కి వెళ్ళే వారికి ఒక్కసారిగా షాక్ తగ్లినట్లు అయింది.లిక్కర్ రేట్లను రేట్లను 20% -50% శాతం వరకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో స్టాక్ కూడా చాలా మంది ప‌క్క‌న పెడుతున్నారు బ్లాక్ మార్కెట్ అప్పుడే స్టార్ట్ అయింది… ఈ ప్రకటించిన ధరలను ఈ ఏడాది ఏప్రిల్ 1 వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పెంచిన ధరలతో ప్రభుత్వానికి అదనంగా 100 కోట్ల ఆదాయం వస్తుందని గోవా సర్కార్ చెబుతోంది. కాగా సామాన్యుడిపై పన్నుల భారం వేయకుండా.. ఎక్సైజ్ డ్యూటీని పెంచామని ప్రభుత్వం సర్ధిచెప్పుకుంది.అయితే ఈ నిర్ణ‌యం చాలా మంది ప‌ర్యాట‌కుల‌కు మాత్రం పెద్ద ఇబ్బంది అంటున్నారు అక్క‌డ హోట‌ల్ య‌జ‌మానులు.. అక్కడ తక్కువకి మ‌ద్యం దొరుకుతుంది ఎంజాయ్ చేయవచ్చు అని భావించిన వాళ్లకు ఈ వార్త కాస్త ఇబ్బందికరమే. మ‌రి గోవా వెళ్లేవారు ముఖ్యంగా మ‌ద్యం ప్రియులు ఈ విష‌యం మ‌ర్చిపోకండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation