Breaking News: భారీగా పెరిగిన బంగారం ధ‌ర

బంగారం ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి ఈ రోజు పరుగులు పెట్టింది. అంతర్జాతీయ సానుకూల పరిస్థితులతోపాటు దేశీయంగా కూడా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి కన్నా ఎక్కువగానే వెండి ధర పెరిగింది. బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం కరోనా వైరస్. చైనా వెలుపల ఇతర దేశాల్లోనే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైన బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో పసిడి ధర గ్లోబల్ మార్కెట్‌లో మళ్లీ ఒక్కసారిగా పరుగులు పెట్టింది. దీంతో మన మార్కెట్‌లోనూ పసిడి ధర పైపైకి కదిలింది. ఇకపోతే మన దేశంలోనూ ఇప్పుడు కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఐదుకు చేరిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Image result for gold

ఇకపోతే దేశీ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదలకు అంతర్జాతీయ రేట్లతోపాటు దేశీ పరిస్థితులు కూడా దోహపడ్డాయి. మన దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో రూపాయిపై ఎఫెక్ట్ పడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడింది. మళ్లీ 72 మార్క్ కిందకు పడిపోయింది… ఏడాది కనిష్ట స్థాయికి పతనమైంది. రూపాయి బలహీనపడటం వల్ల బంగారం దిగుమతుల భారం పెరుగుతుంది. దీంతో పసిడి ధర పెరుగుతుంది.హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పెరిగింది. రూ.110 మేర పైకి కదిలింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.39,870 నుంచి రూ.39,980కు పెరిగింది. అంటే పసిడి ధర మళ్లీ రూ.40 వేల మార్క్ దగ్గరకు చేరిందని చెప్పుకోవచ్చు.

Image result for gold

అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. ఇది కూడా రూ.110 పెరిగింది. దీంతో ధర రూ.43,670 నుంచి రూ.43,780కు చేరింది. ఇకపోతే బంగారం ధర గత రెండు రోజుల్లో దాదాపు రూ.1000 మేర దిగొచ్చిన విషయం తెలిసిందే.బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. పసిడి ధర కన్నా వెండి ధర ఇంకా ఎక్కువగానే పెరిగింది. కేజీ వెండి ధర రూ.250 పరుగులు పెట్టింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,500 నుంచి రూ.48,750కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఈ క్రింది వీడియో చూడండి

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర భారీగానే పెరిగింది. మళ్లీ 1600 డాలర్ల మార్క్ పైకి చేరింది. బంగారం ధర ఔన్స్‌కు ఏకంగా 2.29 శాతం పెరుగుదలతో 1602.55 డాలర్లకు పరుగులు పెట్టింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు ఏకంగా 1.92 శాతం పెరుగుదలతో 16.77 డాలర్లకు చేరింది.పసిడి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు. అలాగే ఎల్లప్పుడూ తగ్గుతూ కూడా రాదు. బంగారం ధర పరిస్థితులకు అనుగుణంగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా ఉండొచ్చు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల ద‌గ్గ‌ర ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation