గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి మాత్రం..

138

రోజు రోజుకి భారీగా పెరుగుతూ హైట్స్ కి చేరుతున్న బంగారం ధ‌ర ఒక్క‌సారిగా త‌గ్గింది.నిన్న పరుగులు పెట్టిన పసిడి ఈ రోజు డీలా పడింది. ఒక్క‌సారిగా గోల్డ్ కాస్ట్ వెలవెలబోయింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో పసడి ధర పెరిగినప్పటికీ దేశీ మార్కెట్‌లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ లేక‌పోవ‌డంతో పసిడిపై ప్రతికూల ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే బంగారం ధర పెరిగితే వెండి మాత్రం అక్కడే స్దిరంగా ఉంది.హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర దిగొచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.280 తగ్గుదలతో రూ.45,700కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గుదలతో రూ.41,840కు పడిపోయింది.

Image result for gold jewellery shop
కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

పసిడి ధర పడిపోతే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. మార్కెట్లో నిలకడగానే ఉంది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో వెండి ధర రూ.48,500 ద‌గ్గ‌ర కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేక‌పోవ‌డం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం పరుగులు పెట్టింది. 1665 డాలర్ల పైకి వచ్చేసింది. పసిడి ధర ఔన్స్‌కు 0.35 శాతం పెరుగుదలతో 1665.90 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.61 శాతం పెరుగుదలతో 17.05 డాలర్లకు చేరింది.

ఈ క్రింది వీడియో చూడండి

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర దిగొచ్చింది. బంగారం ధర రూ.150 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.42,700కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.150 క్షీణతతో రూ.43,900కు పడిపోయింది. ఇక వెండి ధర రూ.48,500 ద‌గ్గ‌ర నిలకడగా కొనసాగుతోంది.ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation