శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధరలు

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం తగ్గింది. ఇక బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పతనమైంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1925 తగ్గుదలతో రూ.43,375కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1940 తగ్గుదలతో రూ.39,830కు పడిపోయింది. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.1910 పడిపోవడంతో వెండి ధర రూ.39,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

యాంకర్ మంజూష హాట్ హాట్ అందాలు చూస్తే తట్టుకోలేరు

Big change in gold and silver prices rate today 30 march 2020 ...

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం పెరుగుదలతో 1657.30 డాలర్ల వద్ద కదలాడుతోంది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 0.15 శాతం తగ్గుదలతో 14.51 డాలర్లకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1730 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.39,120కు చేరింది. వెండి ధర కూడా రూ.1890 తగ్గుదలతో రూ.39,160కు చేరింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర భారీగానే తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1150 తగ్గుదలతో రూ.41,410కు పడిపోయింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1490 తగ్గడంతో రూ.43,710కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర రూ.1910 తగ్గుదలతో రూ.39,500కు పడిపోయింది.

సెగలు పుట్టిస్తున్న నేహా దేశ్ పాండే

బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం కరోనా వైరస్. చైనా వెలుపల ఇతర దేశాల్లోనే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైన బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో బంగారం ధర గ్లోబల్ మార్కెట్‌ లో మళ్లీ పరుగులు పెట్టింది. దీంతో మన మార్కెట్‌ లో కూడా పెరిగింది. బంగారం రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా బంగారం పెరగడానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation