Breaking News : తగ్గిన బంగారం ధరలు

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. నిన్న పెరిగిన బంగారం ధర ఈరోజు మాత్రం కొంచెం తగ్గింది. ఇక బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గడంతో రూ.40,030 వద్దకు చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు స్థిరంగానే ఉంది. రూ.44,030 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది. పసిడి ధర బాటలోనే వెండి ధర నడిచింది. కేజీ వెండి ధర రూ. 550 తగ్గడంతో వెండి ధర రూ.40,360 వద్దకు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Why gold prices are hitting record highs again

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పరుగులు పెట్టింది. పసిడి ధర ఔన్స్‌కు 2.29 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర 1732 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 3.70 శాతం పెరుగుదలతో 15.73 డాలర్లకు ఎగసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.39,120కు చేరింది. వెండి ధర కూడా రూ.450 తగ్గుదలతో రూ.39,160కు చేరింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,960 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.44,260 వద్ద స్థిరంగా ఉంది. ఇక కేజీ వెండి ధరకూ నిలకడగానే ఉంది. రూ.40,360 వద్ద కొనసాగుతోంది.

బంగారం రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా బంగారం పెరగడానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation