Breaking News: భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

185

గత కొన్ని రోజులుగా ర్యాలీ చేస్తూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు తగ్గుతూనే వస్తోంది. వెలవెలబోతూ దిగివస్తూనే ఉంది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడుస్తూ వస్తోంది. వెండి కూడా వెలవెలబోతోంది. భారీగానే తగ్గుతూ వస్తోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో ఇటీవల ఏడేళ్ల గరిష్ట స్థాయిని తాకిన బంగారం ధర ఇప్పుడు భారీగా తగ్గింది. దీంతో భారత్‌లోనూ బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. మనం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. అందువల్ల అంతర్జాతీయ రేట్లు మన దేశంలో బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.

Image result for gold

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుతూనే వస్తోంది. గత నాలుగు రోజుల్లో బంగారం భారీగానే తగ్గించని చెప్పుకోవచ్చు. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.290 తగ్గింది. దీంతో పసిడి ధర రూ.40,710కు చేరింది. బంగారం ధర గత నాలుగు రోజుల్లోకెల్లా మూడు రోజులు తగ్గుతూనే వచ్చింది. ఒక్క రోజు మాత్రం పెరిగింది.అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. ఇది కూడా రూ.290 దిగొచ్చింది. దీంతో ధర రూ.44,410కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర గత నాలుగు రోజుల్లోకెల్లా రెండు రోజులు తగ్గుతూ వచ్చింది. ఒక రోజు పెరిగింది. మరో రోజు స్థిరంగా ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతూ వచ్చింది.

Image result for gold

బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర కూడా పడిపోతూనే వస్తోంది. గత నాలుగు రోజుల్లో వెండి ధర ఏకంగా రూ.1930 త‌గ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.49,570కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర భారీగానే పడిపోయింది. గత నాలుగు రోజుల్లో పసిడి ధర ఏకంగా 55 డాలర్లు తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 18 డాలర్ల నుంచి 16 డాలర్లకు దిగొచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర గత నాలుగు రోజుల్లో రూ.290 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.40,710కు చేరింది. వెండి ధర రూ.49,570కు దిగొచ్చింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర ఈ కాలంలో రూ.250 తగ్గింది.

ఈ క్రింది వీడియో చూడండి

పసిడి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు. అలాగే ఎల్లప్పుడూ తగ్గుతూ కూడా రాదు. బంగారం ధర పరిస్థితులకు అనుగుణంగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా ఉండొచ్చు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.అయితే మ‌రికొన్ని రోజులు బంగారం ధ‌ర‌ల్లో మార్పులు ఉంటాయి అంటున్నారు వ్యాపారులు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation