బ్రేకింగ్ న్యూస్ : కరోనాకు విరుగుడు రెడీ.

90

కోవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ 10,00,000 మందికి సోకగా 53,000 మందికి పైగా మృతి చెందారు. భారత్ లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2289 కు చేరింది. దేశంలో వైరస్ దెబ్బకు రోడ్లన్నీ నిర్మానుష్యం అవుతున్నాయి. ప్రజలు ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావడం లేదు. మొదట్లో చైనాను ఈ వైరస్ అతలాకుతలం చేయగా ప్రస్తుతం యూరప్, అమెరికా దేశాలు వణికిపోతున్నాయి. కరోనాకు మందు కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనలు జరుగుతున్నాయి. చాలా దేశాలు కరోనాకి విరుగుడిని కనిపెట్టే పనిలో పడ్డాయి.

How Doctors Are Treating Patients With Coronavirus Disease : Goats ...

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

ప్రస్తుతం.. ఆస్ట్రేలియా లోని, సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ – CCRO ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే.. కరోనా వైరస్ నివారణలో భాగంగా, వాక్సిన్‌ టెస్టింగ్ దశను ఆల్రెడీ ప్రారంభించింది. అయితే.. ఈ వాక్సిన్ పరీక్ష ప్రాసెస్ కనీసం మూడు నెలల సమయం పడుతుందని పేర్కొనడం గమనార్హం. ఆ మధ్య, చైనా గవర్నమెంట్ అనుమతితో.. వుహన్ లో మార్చి నెలలో అక్కడ కనుగొన్న వ్యాక్సిన్‌కు తొలిదశ ట్రయిల్స్ ను మొదలుపెట్టిన సంగతి విదితమే. ఇక ఈ వ్యాక్సిన్ ప్రయోగం కూడా సక్సెస్ అయ్యిందని… త్వరలోనే రిపోర్టు విడుదల చేస్తామని… చైనీస్ అకాడమీ అఫ్ ఇంజనీరింగ్ సభ్యుడు “చెన్ వీ” చెప్పడం కూడా అందరికి తెలిసినదే. ఇక ఆ రిపోర్టు ఈ నెలలోనే విడుదల కాబోతోంది…ఇకపొతే, ఆస్ట్రేలియన్ యానిమల్ హెల్త్ లాబొరేటరీలోని.. బయో సెక్యూరిటీ కేంద్రంలో అత్యంత భద్రత కలిగిన జీలాంగ్‌లోని ఆయా ప్రయాగాన్ని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. కోయలేషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్ నెస్ ఇన్నోవేషన్స్ – CEPIతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే, సదరు వాక్సిన్ పై పరీక్షలు చేసినట్టు సీసిరో పేర్కొంది.

అలాగే… బ్రిటీష్‌ అమెరికన్‌ టొబాకో – BAT కంపెనీ… పొగాకు మొక్కల నుంచి వాక్సిన్‌ను తయారుచేసి, కరోనాను తరిమి కొడతామని ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసారు. ఇందులో భాగంగానే ఎలాగైనా వాక్సిన్‌ను కనుగొనాలనే లక్ష్యంతో తమ అనుబంధ సంస్థ, కెంటకీ బయో ప్రాసెసింగ్‌ – KBP తో కలిసి.. పొగాకు మొక్కలతో ప్రయోగాలు నిర్వహించి.. పిదప తమ వాక్సిన్‌ను జంతువులపై ప్రయోగించి, ఆ తర్వాత మానవులపై ప్రయోగాలు నిర్వహిస్తామని చెప్పడం గమనార్హం. ఇక తాజాగా ఒక ఫ్రెంచ్ పరిశోధకుడు కోవిడ్ -19 ను పూర్తిగా నయం చేయడానికి ఒక కొత్త చికిత్స విధానాన్ని కనిపెట్టాడు. శాస్త్రవేత్త చేసిన పరిశోధనల్లో ఔషధం ఆరు రోజుల్లో కోవిడ్ -19 ను పూర్తిగా తగ్గిస్తుందని తేలింది. ప్రొఫెసర్ డిడిర్ రావౌల్ట్ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంపై ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఫ్రెంచ్ ప్రభుత్వం కోవిడ్ -19 చికిత్సకు సంబంధించిన పూర్తి బాధ్యతలను అతనికి అప్పగించింది. మరోవైపు క్లోరోక్విన్ కోవిడ్ -19 ను పూర్తిగా తగ్గిస్తుందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో క్లోరోక్విన్ ఫాస్పేట్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. చైనాలోని కోవిడ్ -19 బాధిత రోగులకు ఎక్కువగా క్లోరోక్విన్ ఫాస్ఫేట్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌ లను చికిత్స కొరకు వినియోగించారు.

Content above bottom navigation