తెలంగాణలో గుడ్ న్యూస్… 10 మందికి తగ్గిన కరోనా.

133

కరోనా వైరస్ బారిన పడి ప్రపంచం మొత్తం భయభ్రాంతులకు గురవుతున్న వేళ ఓ శుభవార్త చెప్పారు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఈ రోజు నిర్వహించిన పరీక్షల్లో 10 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని ప్రకటించారు. ఇప్పటి వరకు మొత్తం 65 మందికి తెలంగాణలో కరోనా నిర్ధారణ అయింది. అందులో ఖైరతాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు (74) చనిపోయారు. మరో వ్యక్తి ఇప్పటికే ట్రీట్ మెంట్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు.

యాంకర్ మంజూష హాట్ హాట్ అందాలు చూస్తే తట్టుకోలేరు

వారిద్దరినీ మినహాయిస్తే కరోనా కేసుల సంఖ్య 63 అవుతుంది. ఆ 63 మందిలో పది మందికి కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో బాధితుల సంఖ్య 53కు తగ్గనుంది. వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించిన తర్వాత నెగిటివ్ వస్తే అప్పుడు వారిని ఇళ్లకు పంపుతారు. ఇక తెలంగాణలో ఈరోజు తొలి కరోనా మరణం నమోదైంది. నిన్న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 74 సంవత్సరాల వృద్ధుడు చనిపోయారు. అయితే, అనుమానంతో ఆయన బ్లడ్ శాంపిల్స్ పరీక్షలకు పంపగా, కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఈటల రాజేందర్ తెలిపారు.

Content above bottom navigation