ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లకు గుడ్‌న్యూస్.

విద్యార్దులు ప్ర‌యోజ‌కులు అయితే దానికి కార‌ణం త‌ల్లిదండ్రుల‌తో పాటు గురువులు అని చెప్పాలి
విద్యావ్య‌వ‌స్ద ఎంత బాగుంటే వారిలో అంత చైత‌న్యం వ‌చ్చి మంచి ఉన్న‌త బుద్దులు నేర్చుకుంటాఉ
కాని మనదేశంలో విద్యా వ్యవస్ద అనేది చాలా బలహీనంగా ఉంది.. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల తీరు నాయకులు ఎందరు మారిన మాటల మూటలేగాని, మార్పు లేదు…అసలు ఈ విషయంలో మాత్రం వారి పనితీరు మాత్రం గాల్లో దీపంలా ఉంది.. ఇక ప్రైవేటు పాఠశాలల్లో టీచర్ల సంఖ్య పెద్దగా లేక‌పోయినా విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. విద్యా పథకాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ.వేల కోట్లను వెచ్చిస్తున్నా ఫలితాలు ఆశించిన మేర రావడం లేదు. సమగ్ర శిక్షా అభియాన్ కిందే ఏటా వెచ్చిస్తున్న రూ. 2 వేల కోట్లు కలుపుకొని ఏటా పాఠశాల విద్యకు రూ. 11 వేల కోట్లు కేటా యించినా ప్రభుత్వ బడులు విద్యార్థులను ఆకట్టులేకపోతున్నాయి.

Image result for ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లకు

ప్రభుత్వ టీచర్లు సరిగ్గా చెప్ప రన్న అపవాదు, ప్రైవేటు పాఠశాలల ఆకర్షణీయ విధానాలతో తల్లిదండ్రులు తమ పిల్ల లను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్లకు హైకోర్టు ఒక శుభవార్త చెప్పింది.. అదేమంటే ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్లలో టీచరుగా జాయినింగ్ రిపోర్టు ఇచ్చిన రోజు నుంచి సర్వీసు బెనిఫిట్స్ లెక్కించి ఇవ్వాలని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఉద్యోగికి సంబంధించిన అన్ని రకాల బెనిఫిట్స్ చెల్లింపులకు సర్వీసులో చేరిన మొదటి రోజు నుంచే లెక్కలోకి తీసుకోవాలని ఆదేశించింది.

ఈ క్రింది వీడియో చూడండి

పెన్షన్ ఖరారుకూ ఇది వర్తిస్తుందని హైకోర్టు జడ్జి అమర్నాథ్ గౌడ్ తీర్పిచ్చారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ బాలికల పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైరైన సుమిత్ర, ఇతరులు వేసిన కేసులో శనివారం ఈ తీర్పు వెలువరించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పోస్టులో 1959-65 పీరియడ్‌లో ఉద్యోగంలో చేరిన తమకు.. 10,15, 20 ఏళ్ల సర్వీసు ఇంక్రిమెంట్, పెన్షన్ బెనిఫిట్స్ పొందడానికి అధికారులు అనుమతించట్లేదని ఆరోపించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ నుంచి తమ స్కూలును ప్రభుత్వం తొలగించడంతో సర్వీస్ రూల్స్ తమకు వర్తించదని మేనేజ్ మెంట్ వాదించింది…అయితే ఇది చాలా వ‌ర‌కూ ప్రైవేట్ ప‌బ్లిక్ స్కూళ్ల‌కు, అందులో ప‌నిచేస్తున్న టీచ‌ర్లకు బెనిఫిట్ అనే చెప్పాలి.. మొత్తానికి దీనిపై టీచ‌ర్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు, ఏదైనా ప్రైవేట్ స్కూల్స్ కంటే మ‌న ప్ర‌భుత్వ స్కూల్లో పిల్ల‌ల‌ను బాగా చేర్పించే రోజుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు, ముందు విద్యాల‌యాల్లో వ్య‌వ‌స్ధ‌లో కూడా మార్పు రావాల్సి ఉంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation