కరోనా పై తెలంగాణకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఆనందంలో కెసిఆర్

119

కరోనా హైదరాబాద్ నగరంలో శరవేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా.. పెద్దగా ఫలితం కనిపించడం లేదు. కరోనా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒక్క జీహెచ్ ఎంసీ పరిధిలోనే వెయ్యి కేసులు దాటిపోయాయి. ఈ జోరు చూస్తుంటే.. హైదరాబాద్ లో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయ్యిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

అయితే అదృష్టవశాత్తూ ఇంకా అంత దారుణంగా పరిస్థితి లేదని ఏకంగా ఐసీఎంఆర్ ధ్రువీకరించింది. తెలంగాణలో సమూహ వ్యాప్తి జరగలేని ఐసీఎంఆర్ తేల్చి చెప్పింది. దేశంలో కరోనా వ్యాప్తి తీరు తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ సర్వే చేసింది. ఆ ఫలితాలు వెల్లడించింది.

దీని ప్రకారం తెలంగాణలోనూ కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదట. ఈ విషయం తెలుసుకునేందుకు తెలంగాణలో మే 15నుంచి 17వరకు శాంపిళ్లు సేకరించారు.ఈ శాంపిళ్లు ఎక్కడ సేకరించారంటే.. నల్గొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కో జిల్లాలో 400 చొప్పున 1200 రక్తనమూనాలు తీసుకున్నారు.

ఆ తర్వాత మే 30, 31 తేదీల్లో దేశంలోని 13 హాట్ స్పాట్ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ లో 500 శాంపిళ్లు సేకరించారు. చందానగర్, మియాపూర్, టప్పాచబుత్ర, ఆదిభట్ల , బాలాపూర్లలో ఒక్కో కంటైన్మెంట్ నుంచి 100 చొప్పున రక్తనమూనాలు సేకరించారు. వాటిని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఇన్ట్యుబెక్యులోసిస్ సంస్థలో విశ్లేషించారు.

Content above bottom navigation