మందుబాబులకు గుడ్ న్యూస్… రోజూ 3 గంటలపాటు మద్యం ?

119

దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం ప్రకటించనట్టుగానే ఏప్రిల్ 14వ తేది లాక్ డౌన్ ముగుస్తుందా లేదా అన్న విషయం మాత్రం ప్రస్తుతం దేశప్రజలను కాస్త సందిగ్థంలో ఉంచాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నో ప్రశ్నలు, ప్రజలను వెంబడిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనదేశం కన్నా ముందు లాక్ డౌన్ విధించిన దేశాలు ఇప్పటి వరకూ లాక్ డౌన్ ను ఎత్తేయలేదు. దాంతో మన దేశంలో కూడా లాక్ డౌన్ ను కంటిన్యూ చేస్తారేమో అని సామాన్య ప్రజానీకం అనుకుంటుంది. అయితే లాక్ డౌన్‌తో సామాన్యుల పరిస్థితి ఏమో కానీ… మందుబాబులు మాత్రం కిందమీద పడుతున్నారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న మౌని రాయ్

Meghalaya BJP Chief Asks State To Let Wine Shops Open: Way Of Life

చుక్క లేనిది నిద్ర పట్టని లిక్కర్ బాబులకు లాక్ డౌన్ చుక్కలు చూపిస్తుంది. దీంతో చాలామంది పిచ్చెక్కి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ తోనే హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు రోగుల తాకిడి పెరిగింది. ఏదో ఒక్కరోజు జనతా కర్ఫ్యూయే కదా అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత కర్ఫ్యూను నెల రోజుల పాటు పెంచుతూ కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో మందుబాబులు మందు కూడా కొని నిల్వ చేసుకోలేదు. లాక్ డౌన్ వేళ నిత్యవసరాలు దొరుకుతున్నాయి కానీ.. మద్యం మాత్రం ఎక్కడా దొరకని పరిస్థితి. దీంతో కొందరు మందు దొరక్క మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకంటున్నారు. మరికొందరు ఊళ్లలో ఏది దొరికితే అది తాగుతున్నారు. గుడుంబా, కల్లు, సారా ఇలా ఏది పడితే అది తాగుతున్నారు. కొందరు లేనిపోనివి తాగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇదే అదునుగా ఊళ్లలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. దీంతో నిన్నమొన్నటివరకు బ్రాండ్‌లు తాగే మందుబాబులు కూడా దొరికింది తాగేస్తున్నారు.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ హీరోయిన్ ఊర్వశి రౌటేలా

మందుబాబుల అవస్థలు చూసిన కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుంది. కర్ణాటక ఎక్సైజ్ శాఖ మందుబాబులకు ఓ శుభవార్త చెప్పే యోచనలో ఉంది. దేశంలో లాక్ డౌన్ ను ఒక వేళ పొడగిస్తే.. ఆ తర్వాత రోజుకి ఓ ముడు గంటల పాటు మద్యం విక్రయాలను అనుమతించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా లాక్ డౌన్ కారణంగా మద్యం బంద్ కావడంతో మందుబాబులు తీవ్ర మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. దీంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడడం, ఇతరులపై దాడికి పాల్పడుతున్నారు. ఈ తరుణంలోనే లాక్ డౌన్ ను పొడగిస్తే రోజూ ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు మద్యం విక్రయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయం మీద ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎర్రగడ్డ హోస్పిటల్ కు వస్తున్నా కేసులన్నీ కూడా మద్యానికి బానిస అయినవాళ్లవే. అందుకే తెలంగాణలో కూడా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవేళ మద్యం షాపులు తెరిస్తే మాత్రం మందు బాబులకు పండుగే అని చెప్పాలి.

Content above bottom navigation