రేపటి నుంచి APలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు

ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే కేంద్రం విధించిన మార్గదర్శకాల కారణంగా కేవలం గ్రీన్ జోన్లలోనే బస్సులు నడిపేందుకు అనుమతి ఉంది. అదీ పలు జాగ్రత్తలతో పరిమిత సంఖ్యలో ప్రయాణికులతోనే. వీటికి అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

పొర్తి వివరాలకు ఈ వీడియో చూడండి:

ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రారంభం కాగానే మిగతా సేవలతో పాటు ఆర్టీసీ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ప్రజా రవాణా వల్ల కరోనా వైరస్ ఎక్కువగా, త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం జనతా కర్ఫ్యూ నుంచే ఆర్టీసీ సర్వీసులను నిలిపేసింది. ఏప్రిల్ 20 తర్వాత పరిమిత సడలింపులు అమల్లోకి రావడంతో తక్కువ సర్వీసులను నడిపేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ఎప్పుడు లాక్ డౌన్ సడలిస్తారా బస్సులు నడుపుదామా అని ఎదురుచూస్తున్న ఆర్టీసీకి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

ప్రస్తుతానికి రేపటి నుంచి కరోనా గ్రీన్ జోన్ పరిధిలో ఉన్న విజయనగరం జిల్లా వరకూ ఆర్టీసీ సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇరువైపులా ఉన్న రెడ్ జోన్ విశాఖ జిల్లా, ఆరెంజ్ జోన్ శ్రీకాకుళం జిల్లాతో సంబంధం లేకుండా కేవలం జిల్లా పరిధిలోనే ఆర్టీసీ సర్వీసులను ప్రయోగాత్మకంగా నడపబోతోంది. అదీ పరిమిత ప్రయాణికులతో, పలు జాగ్రత్తలతోనే అని తెలుస్తోంది. బస్సుల్లో సగం మందిని మాత్రమే అనుమతిస్తారు. అలాగే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. బస్సుల్లో ఒక్కో వరుసలో చెరో కిటికీ వైపు ఇద్దరు, మధ్యలో ఒకరు చొప్పున కూర్చునేందుకు అనుమతిస్తారు.

ప్రస్తుతానికి పాసింజర్, ఎక్స్ ప్రెస్ సర్వీసులు మాత్రమే నడపాలని అధికారులు నిర్ణయించారు. అలాగే బస్సులో కండక్టర్ ను పంపితే వైరస్ వ్యాప్తి అవకాశాలు ఉంటాయి కాబట్టి డ్రైవర్ తోనే బస్సులు నడుపుతారు. అలాగే బస్టాండ్లతో పాటు కొన్ని ముఖ్యమైన పాయింట్లలో ఆర్టీసీ సిబ్బంది అందుబాటులో ఉంటూ టికెట్లు ఇస్తారు. టికెట్లు ఉన్న వారినే బస్సుల్లోకి అనుమతిస్తారు. బస్సులను కూడా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేశాకే రాకపోకలకు అనుమతిస్తారు.

Content above bottom navigation