శుభవార్త.. దిగొచ్చిన గ్యాస్ సిలిండర్ ధర..

137

మోదీ సర్కార్ మధ్యతరగతి ప్రజలకు తీపికబురు అందించింది. గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తాజాగా ఎల్‌పీజీ సిలిండర్ ధరలో రూ.61.5 కోత విధించింది. దేశం మొత్తం లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ తగ్గింపు మంచి నిర్ణయమని చెప్పొచ్చు. 14.2 కేజీల నాన్ సబ్సిడీ సిలిండర్లకు తగ్గింపు రేటు వర్తిస్తుంది.తాజా రేట్ల కోత నేపథ్యంలో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.744కు దిగొచ్చింది. ఇది వరకు సిలిండర్ ధర రూ.805.50 వద్ద ఉంది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.744.5కు తగ్గింది. ముంబైలో సిలిండర్ ధర రూ.714.5కు క్షీణించింది. చెన్నైతో గ్యాస్ సిలిండర్ ధర రూ.761.5కు దిగొచ్చింది. గతంలో ఈ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధర వరుసగా రూ.839.5గా, 776.5గా, రూ.826గా ఉంది.

తమన్నా చీరలో మొత్తం చూపించేసింది ఆసలు తట్టుకోలేరు

Domestic Gas Cylinder Price Down 2nd Consecutive Month After PNG ...

కేవలం 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే కాకుండా 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర కూడా తగ్గింది. ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ.96 దిగొచ్చింది. దీంతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ దర రూ.1381.5 నుంచి రూ.1285.5కు తగ్గింది. కోల్‌కతాలో ధర రూ.1348.5కు, ముంబైలో రూ.1234.5కు, చెన్నైలో రూ.1402కు క్షీణించింది.కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి కుబుంబానికి 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకే అందిస్తున్న విషయం తెలిసిందే. 14.2 కేజీల సిలిండర్లకు వర్తిస్తుంది. ఏడాదిలో ఈ లిమిట్ దాటిపోతే అప్పుడు సబ్సిడీ మొత్తం రాదు. సిలిండర్ ధర ఎంత ఉందో అంతే చెల్లించాలి.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

ఇకపోతే గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోని క్రూడ్ ధరలు సహా రూపాయి మారక విలువపై ఆధారపడి గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది. అందుకే గ్యాస్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. ధర తగ్గొచ్చు. పెరగొచ్చు. లేదంటే అలాగే కూడా ఉండొచ్చు.

Content above bottom navigation