శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. భారీగా పతనమైన వెండి

111

పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. బంగారం ధర ఈరోజు కూడా దిగొచ్చింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లోనూ పసిడి ధర తగ్గిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే..

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 దిగొచ్చింది. దీంతో ధర రూ.44,680కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 10 గ్రాముల బంగారం ధర రూ.390 క్షీణించింది. దీంతో ధర రూ.48,780కు దిగొచ్చింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1260 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,900కు క్షీణిచింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్కు 0.04 శాతం దిగొచ్చింది. దీంతో ధర ఔన్స్కు 1704 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్కు 0.01 శాతం తగ్గుదలతో 17.95 డాలర్లకు క్షీణించింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి ధర భారీగానే పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 దిగొచ్చింది. దీంతో ధర రూ.45,450కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా దిగొచ్చింది. రూ.500 తగ్గుదలతో రూ.46,650కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర భారీగా తగ్గింది. రూ.1260 తగ్గుదలతో రూ.48,900కు పడిపోయింది

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి

Content above bottom navigation