బ్రేకింగ్‌: ఈ కండీష‌న్‌తో ఆర్టీసీ బ‌స్సుల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ వ‌చ్చేసింది

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలో మే 3వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతోన్న లాక్ డౌన్ ఇప్పుడు పొడిగించారు. ఇక ఇప్పుడు మ‌రో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించిన సంగ‌తి తెలిసిందే.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి:

జోన్ల వారీగా కొన్ని ప‌రిమితుల‌తో లాక్ డౌన్ ఎత్తేశారు. ఇదిలా ఉంటే గ్రీన్‌జోన్ల‌లో చాలా వ‌ర‌కు నిబంధ‌న‌లు స‌వ‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే ప్ర‌జారవాణాకు సైతం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక గ్రీన్‌జోన్ల‌లో ఆర్టీసీ బ‌స్సుల‌కు కూడా ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌నున్నారు. అయితే బ‌స్సులో కూడా సోష‌ల్ డిస్టెన్స్ త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. 50 శాతం సీట్ల సామర్థ్యంతో బస్సులు ప్రయాణించవచ్చు.

ఈ ప్ర‌జారవాణ ఇత‌ర రాష్ట్రాల ప్ర‌యాణికుల‌కు, దూర ప్రాంతాల‌కు వెళ్లేవారికి పెద్ద వెసులు బాటే అని చెప్పాలి.

Content above bottom navigation