కరోనా దెబ్బకి టీటీడీ కీలక నిర్ణయం..కొత్త రూల్స్ ఇవే

116

ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులను అనుమతిస్తూ వస్తున్న టీటీడీ… రోజూ పరిమిత సంఖ్యలో మాత్రమే స్వామివారి దర్శనభాగ్యం కల్పించేలా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రోజూ సుమారు 7 వేల మంది మాత్రమే స్వామిని దర్శించుకుంటున్నారు.

టీటీడీ సైతం అందుకు తగ్గట్టుగానే ఆన్‌లైన్‌లోనూ, అలిపిరి దగ్గర దర్శనం స్లాట్ బుకింగ్‌లకు అనుమతి ఇస్తోంది. అయితే స్వామివారి దర్శనానికి మరికొంత ఎక్కువ మంది భక్తులను అనుమతించే దిశగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను టీటీడీ పెంచింది.

ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు స్లాట్‌కు 250 మందికి అదనంగా దర్శనం చేయించేలా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం రోజువారీ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 6,750 నుంచి 9,750కి పెరగనుంది.

Content above bottom navigation