కన్నకూతురిపై ప్రేమతో ఒకరిని హత్య చేశాడు.కూతురు రాదన్న అక్కసుతో సూసైడ్ చేసుకున్నాడు.పరువు హత్య కాస్తా చివరకు ఆత్మహత్యతో ఈ కేసు ముడిపడింది.అమృత తండ్రి మారుతీ రావు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది.
కూతురు రాదన్న కోపంతో ఆత్మహత్య చేసుకున్నాడా?ఆస్తి తగాదాలే సూసైడ్ కు ప్రేరేపించాయా అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఇప్పుడు మరో విషయంలో మారుతీరావు కేసు విచారణ సాగుతోంది.లోతైన విచారణలో తెలుస్తున్న వాస్తవాలు ఏమిటి? సర్కారు ఆలోచన ఏమిటో చూద్దాం.

మారుతీరావుఆస్తులు రూ.200 కోట్ల పైగానే ఉంటాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇప్పుడు వ్యవహారమంతా అతడి ఆస్తుల చుట్టే తిరుగుతోంది. పోలీసులు విచారిస్తే అతని బినామీల గుట్టు వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మారుతీరావు సాధారణ కిరోసిన్ వ్యాపారిగా మిర్యాలగూడ పట్టణవాసులకు సుపరిచితుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు బిల్డర్ అవతారమెత్తి అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగెత్తాడు. పరువు హత్య అభియోగంతో అదే తరహాలో అథఃపాతాళానికీ పడిపోయాడు. చివరకు తన మరణశాసనాన్ని తానే లిఖించుకుని మరోమారు సంచలనంగా మారాడు..

మారుతీరావు కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని అల్లుడు ప్రణయ్‌ని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లుగా మారుతీరావు అభియోగాలు ఎదదుర్కొని… ఎ1 నిందితుడిగా ఏడు నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చాడు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మారుతిరావు తన ఆస్తులను చక్కబెట్టుకునే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. మారుతిరావు కూతురు అమృత మీడియాతో మాట్లాడిన సమయంలో బినామీలు ఉన్నారని, ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయని చెప్పడంతో అందరి దృష్టి అతడి ఆస్తి విషయంపైకి మళ్లింది. 25 ఏళ్ల క్రితం సాధారణ కిరోసిన్ వ్యాపారిగా పాత స్కూటర్‌పై తిరిగిన మారుతిరావు.. అనతి కాలంలోనే కోట్లాదిపతిగా మారాడు. అటు బిల్డర్ అవతారం ఎత్తి అద్దంకి – నార్కట్‌పల్లి రహదారి వెంట ఉన్న శరణ్య గ్రీన్హోమ్స్లో సుమారు వంద నివాసాలు నిర్మించి అమ్మాడు. దాంతో పాటు అక్కడే ఉన్న అపార్ట్మెంట్లు, ఈదులగూడలో రెండంతస్తుల షాపింగ్ మాల్స్ నిర్మించి అమ్మాడు.
అదే విధంగా పట్టణ నడిబొడ్డున బస్టాండ్‌కు అతి సమీపంలో నటరాజ్ థియేటర్ స్థలంలో అతి పెద్ద మల్టీప్లెక్స్ నిర్మాణంలో ఉండగా అక్కడే ఆయన కార్యాలయం కూడా ఉండేది. దాంతో పాటు అద్దంకి – నార్కట్‌పల్లి బైపాస్ రోడ్డులో చింతపల్లి రోడ్డు సమీపంలో ఒకటి, ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో మరో ఖాళీ స్థలాలు ఉన్నట్లు తెలుస్తోంది.. తాళ్లగడ్డ సమీపంలో ఒక వెంచర్, దామరచర్ల మండలంలో వ్యవసాయ భూములు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.. సుమారుగా రూ.200 కోట్లకుపైగా ఆస్తులు సంపాదించిన మారుతీరావు చివరికి ఆత్మహత్యతో జీవితాన్ని ముగించాడు. బిల్డర్‌గా, రియల్టర్‌గా కొనసాగిన మారుతీరావు తనతో పాటు కొంతమందిని బినామీలుగా వాడుకున్నట్లు తెలుస్తోంది.. బినామీలుగా ఆయన దగ్గర గతంలో పని చేసిన వారు, ప్రస్తుతం పనిచేస్తున్న వారితో పాటు వారి కుటుంబసభ్యుల పేరున కూడా భూములు కొనుగోలు చేసి వారికి రిజిస్ట్రేషన్లు కూడా చేయించినట్లు తెలుస్తోంది. వారి దగ్గర నుంచి అవసరం వచ్చిన సమయంలో తిరిగి ఆయన పేరు మీదకి మార్చుకునే వారని తెలిసింది. ఆయన జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కొంత మంది బినామీలు భూములను విక్రయించుకోవడంతో పాటు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆస్తులను సర్దుకున్నట్లు చెబుతున్నారు. రూ.కోట్ల విలువల గల ఆస్తులను బినామీలు చక్కబెట్టుకోవడంతో ఆయన ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉండే వారని తెలిసింది.
ఈ క్రింది వీడియో చూడండి
మారుతీరావు ఆస్తుల విషయంపై పోలీసులు విచారణ చేస్తే బినామీలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.
ఆస్తుల విషయంలో కటుంబ సభ్యులకు వివాదాలు ఉన్నట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్న మారుతీరావు ఆత్మహత్య ఏ కోణంలో చేసుకున్నాడనే విషయంపై పోలీసులు విచారించనున్నారు. అయితే ఆయన జైలుకి వెళ్లిన తర్వాత జరిగిన క్రయ విక్రయాలు అన్నీ పరిశీలించనున్నారు అధికారులు, అలాంటి వారిలో మారుతీరావుకి సంబంధించిన వారు ఉంటే వారి నుంచి వివరాలు రాబట్టనున్నారు, ఇలాంటి బినామీ ఆస్తులు ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని వార్తలు వస్తున్నాయి, ఇలా మారుతీరావు జైలుకి వెళ్లిన తర్వాత జరిగిన అమ్మకాల రిజిస్ట్రేషన్లు కూడా పరిశీలిస్తున్నారట. సో ఇలా కూడా కేసు విచారణ సాగుతోంది అని తెలుస్తోంది.
ఈ క్రింది వీడియో చూడండి