కరోనా లాక్డౌన్ వల్ల ఎంతో మంది రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిందరికీ కేంద్ర కార్మికశాఖ గుడ్న్యూస్ చెప్పింది. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ చందాదారులకు నిరుద్యోగ భృతి ఇస్తోంది కేంద్రం.
ఇది కూడా చదవండి: చైనాలో వ్యాపిస్తున్న మరో మహమ్మారి హెచ్చరిస్తున్న సైంటిస్టులు
వారి నెల జీతంలో 50 శాతం సొమ్మును భృతిగా చెల్లిస్తారు. అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన పథకం కింద ఈ సాయం లభిస్తుందని కేంద్ర కార్మికశాఖ తెలిపింది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం వచ్చే ఏడాది జూన్ 30 వరకు.. అంటే ఏడాది పాటు కొనసాగుతుంది.
ఇది కూడా చదవండి: కళ్లజోడు ధరిస్తే వైరస్ రాదా..! డాక్టర్లు ఏం చెప్పారంటే?
ఈ పథకం కింద గతంలో వేతనంలో 25 శాతం నిరుద్యోగ భృతి లభించగా.. ప్రస్తుతం దాన్ని 50శాతానికి పెంచారు. కనీసం రెండేళ్లు ఉద్యోగం చేసి, 78 రోజులకు తగ్గకుండా ESIC చందాదారులుగా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
ఇది కూడా చదవండి: రియల్ బాహుబలి: పిల్లల కోసం తల్లి త్యాగం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: