పెళ్ళిలో DJ బాక్సులు పెళ్లి కొడుకు ప్రాణం తీసాయి.. ఎలానో తెలిస్తే షాకవుతారు

171

ప్రాణం పోకడ‌- వ‌ర్షం రాక‌డ ఎవ‌రూ చెప్ప‌లేరు అంటారు..ఎప్పుడు ఎలాంటి సంఘ‌ట‌న జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు..ఆనందం సంతోషం వెల్లివిరిసిన వేళ ఆ ఇంట విషాదం అల‌ముకుంది.కాళ్ల పారాణి ఆర‌కుండానే భార్య‌ తాళిబొట్టు తెగింది..నిండు నూరేళ్లు క‌లిసి ఉంటాను అని ఏడ‌డుగులు న‌డిచిన వ‌రుడు అకాల మ‌ర‌ణం పొందాడు.మేళ తాళాలతో వేద మంత్రాలతో ఘనంగా పెళ్లి జరిగింది .నాతి చరామి అని కోటి ఆశలతో తన జీవితంలోకి అడుగుపెడుతున్న వధువుకు ప్రమాణం చేశాడు ఆ వరుడు . శతమానం భవతి అని బంధు మిత్రులు, వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న సంతోషంలో పెళ్లి జరిగాక బరాత్ లో పెళ్లి కొడుకు స్నేహితులతో కలిసి డాన్స్ చేసాడు.

Image result for indian marriages

అదే అతని పాలిట యమపాశం అయ్యింది. అంతా సంతోషంలో ఉండగానే ఊహించని విషాదం వధూ, వరుల కుటుంబాలను శోక సంద్రంలో ముంచింది. పెళ్లి … నూరేళ్ళ పంట .. ఇద్దరి జీవితాలను ముడి వేసి , దాంపత్య బంధాన్ని కొనసాగించాలని పెద్దలంతా నిండు మనసుతో ఆశీర్వదించి చేసే శుభ కార్యం . ఎన్నో ఆశలతో పెళ్లి కూతురు, తన అర్దాంగితో కలిసి ఎంతో భవిష్యత్ ను ఊహించుకుంటూ పెళ్లి కొడుకు కొత్త జంటగా నిండు నూరేళ్ళు పిల్లాజెల్లలతో జీవనం సాగించాలని బంధు మిత్రులు ఆశీర్వదించగా పెళ్లి మండపం నుండి ఇంటికి బయలు దేరారు .ఇక ఈ క్రమంలో ఘనంగా బరాత్ నిర్వహించారు. బరాత్‌లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. బరాత్‌లో నృత్యం చేస్తూ వరుడు అస్వస్థతకు గురయ్యి మృతి చెందిన ఘటన వధువుకు షాక్ కాగా ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది .

ఈ క్రింది వీడియోని చూడండి

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగలి గణేష్ అనే యువకుడి వివాహం శుక్రవారం మధ్యాహ్నం జరిగింది . పెళ్లి వేడుకలో భాగంగా రాత్రి బరాత్‌ నిర్వహించారు. ఈ సమయంలో డీజే సౌండ్‌కు అస్వస్థతకు గురైన గణేశ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని బంధువులు ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. గణేశ్ గుండెపోటుతోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.డీజే సౌండ్ కు అతనికి గుండెపోటు వచ్చినట్టు తెలుస్తుంది.దీంతో కాళ్ళ పారాణి ఆరక ముందే వరుడు మృతి చెందటంతో వధువు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. పెళ్లి మందిరం అయినా తియ్యక ముందే కడతేరిపోయిన వరుడ్ని , అతని కోసం ఆ కుటుంబాలు పడుతున్న వేదన చూసి స్థానికులు సైతం కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలా చోట్ల చోటు చేసుకుంటున్నాయి. డీజే శబ్దాలతో ప్రాణాలు కోల్పోతున్న వధూవరుల సంఖ్య పెరుగుతుంది. సంతోషంలో మోగుతున్న డీజే లు చావు డప్పు కొట్టిస్తున్న తీరు అందరినీ ఆవేదనకు గురి చేస్తుంది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation