గాంధీ హాస్పిటల్ లో ఉన్న కరోనా పేషెంట్ ఇతనే.. ఏం చేస్తున్నాడో చూస్తే బిత్తర పోతారు

192

హైదరాబాద్‌లో తొలి కరోనా వైరస్ కేసు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దుబాయ్ నుంచి బెంగళూరు మీదుగా వచ్చిన యువకుడు ఆదివారం కరోనా లక్షణాలతో గాంధీలో చేరగా, సోమవారం అతడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో అతణ్ని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా బారిన పడ్డ వ్యక్తి ట్రీట్ మెంట్ పొందుతున్న ఎమర్జెన్సీ వార్డులో ఉన్నట్టు తెలుస్తోంది. రూమ్ మొత్తంలో ఇతనొక్కడే ఉన్నాడు. చుట్టూ ఎవరు లేక విగతజీవిగా పడి ఉన్నాడు. డాక్టర్స్, నర్స్ లు ఎవరు కూడా ఇతని దగ్గరకు వెళ్లే సాహసం చెయ్యడం లేదు. చాలా జాగ్రత్తలు తీసుకుని ఇతని వద్దకు వెళ్తున్నారు. ఇతనికి పెట్టె ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇతని రూమ్ లోకి తీసుకెళ్లే ప్రతి వస్తువును కూడా లోపలనే ఉంచుతున్నారు. బయటకు తీసుకురావడం లేదు. ఇక ఈ వ్యక్తిని ఉంచిన గదిలో వాష్ రూం కూడా లేదని వార్తలొస్తున్నాయి. దీంతో అతడు కాలకృత్యాలను తీర్చుకోవడంలో ఇక్కట్లు ఎదుర్కొన్నాడని, హాస్పిటల్‌ లో ప్రత్యేకమైన టాయిలెట్ లేకపోవడంతో అతడు పబ్లిక్ టాయిలెట్‌ ను ఉపయోగించాల్సి వచ్చిందని వార్తలొస్తున్నాయి.

Image result for గాంధీ హాస్పిటల్ లో ఉన్న కరోనా పేషెంట్ ఇతనే

కరోనా సోకిన వ్యక్తి పబ్లిక్ టాయిలెట్‌ ను వాడటంతో ఇప్పుడు దాన్ని ఉపయోగించే విషయమై మిగతా రోగులు, ఆసుపత్రి సిబ్బంది తటపటాయిస్తున్నారు. దీనితో అక్కడ తీవ్ర అలజడి నెలకొంది. కామన్ బాత్ రూమ్ లోకి అసలు కరోనా పేషేంట్ కు ఎలా పంపిస్తారు అంటూ అక్కడి వారంతా గగ్గోలు పెడుతున్నారు. జరిగిన ఘటనపై అధికారులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఐసోలేషన్ వార్డులో బాత్ రూమ్ సదుపాయం లేదని అధికారులు ప్రభుత్వానికి తెలిపినట్లు తెలుస్తుంది. కరోనా వైరస్ వచ్చి మూడు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఐసోలేషన్ వార్డులో బాత్‌రూమ్ ఏర్పాటు చేయకపోవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఐసోలేషన్ వార్డు ఉన్న అంతస్తుకు ఐసీయూను కూడా షిఫ్ట్ చేస్తున్నారు. పోలీసులను కాపలా ఉంచి సంబంధిత సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఇప్పటి వరకూ 380 మందికి పరీక్షలు నిర్వహించగా, మరో 80 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 27న ఆ యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ రావడంతో అతడు కలిసిన ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అతడు నగరంలో చాలా ప్రాంతాలకు వెళ్లి సన్నిహితులను కలిసినట్టు సమాచారం. కరోనా రోగి న్యూమోనియాతో బాధపడుతున్నాడని, ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని గాంధీ డాక్టర్లు తెలిపారు. మరోపక్క ప్రభుత్వం మాత్రం ఈ కరోనా ను అరికట్టడమా కోసం ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడం తో పాటు తాజాగా మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation