శోభనానికీ ఫ్లెక్సీ పెట్టాడు శోభనం టైం కి జనాలు ఏం చేసారు తెలుసా

522

ఈరోజుల్లో ప్రతీది పండుగే.. ఆకలి రాజ్యం సినిమాలో అన్నట్టు ‘చావు కూడా ఒక పండుగ’లానే నిర్వహిస్తున్నారు. విషాదంలోనూ విందులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకే ఆనందంగా జరుపుకునే తన ఫస్ట్ నైట్ ను ఎందుకు పండుగలా జరుపుకోవద్దని ఒక యువకుడు ఉబలాటపడ్డాడు. అనుకుందే తడువుగా చివరకు తన తొలి రాత్రి మహోత్సవాన్ని ఘనంగా చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.. ఆయన శోభన మహోత్సవ ఆహ్వానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫ్లెక్సీ ఫొటోను షేర్ చేస్తూ రాజేశ్ రసికతకు నెటిజన్లంతా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

తూర్పు గోదావరిజిల్లా జగ్గంపేట. అతని పేరు మరెళ్ళ రాజేష్. రాధతో ఇతనికి వివాహం జరిగింది. సాధారణంగా వివాహం అయిన తరువాత శోభనం నిర్వహించడం ఆనవాయితీ. శోభనాన్ని కూడా సంప్రదాయబద్థంగానే చేస్తారు. అలాగని ఊరంతా శోభనం గురించి ఎవ్వరూ చెప్పుకోరు. అలా చెప్పుకుని చేసుకోరు. కానీ రాజేష్ రూటే సెపరేటు. ఏకంగా శోభన మహోత్సవ ఆహ్వానమంటూ ఊరంతా ఫ్లెక్సీలు పెట్టాడు.

Image result for first night flexy

‘‘నేటితో నా బ్రహ్మచారి జీవితానికి సంప్రదాయబద్దంగా స్వస్తి పలికి, తొలిరేయి అనుభవానికి తహతహలాడుతున్నానని ఫ్లెక్సీలో ఘాటు పదాలతో అందరికీ మూడ్ వచ్చేలా కొట్టించాడు. యుద్దానికి వెళ్లే సైనికుడి వలే రతియుద్ధాన్ని జయిస్తానని.. తన తల్లిదండ్రులను నానమ్మ తాతయ్యలను చేస్తానని రాజేశ్ ఫ్లెక్సీలో మాట ఇచ్చాడు. భరత్ అనే నేనులో మహేష్ బాబు ‘నేను.. ’ అనే డైలాగ్ పేల్చినట్టు ‘మూరేళ్ల రాజేశ్ అనే నేను..’ అని మొదలుపెట్టి మనోడు ఏర్పాటు చేసిన ‘శోభన మహోత్సవ ఆహ్వానం’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..ఇతని ఫ్లెక్సీ చూసినవాళ్లు ఇతనికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.

Image result for శోభనానికీ ఫ్లెక్సీ

ఇక రాజేశ్ రసికతను చూసి ఊరోళ్లంతా నోరెళ్లబెట్టారు. అతడి ఫ్రెండ్స్ మాత్రం ఎంకరేజ్ చేసినట్టున్నారు. ఈ బ్యానర్ లో పెళ్లి కొడుకు ప్రమాణం చేస్తున్నట్టు ప్రత్యేకంగా ఫోటో దిగి మరీ ఫోజివ్వడం చూసి నవ్వుకోని వారు లేరు. అయితే కొందరు దీనిని తప్పు పడుతున్నారు. ఇది సంప్రదాయాలను ఎగతాళి చేయటమే తప్ప మరొకటి కాదని విరుచుకుపడుతున్న వాళ్ళు ఉన్నారు. పవిత్రమైన సృష్టి కార్యాన్ని ఏదో ఘన కార్యం లాగా ఏ మాత్రం మొహమాటపకుండా, ఇలా ఊరందరిని ప్రచారానికి పిలవడం గురించి పేలుతున్న కామెడీ మామూలుగా లేదు. ఏది ఏమైనా ఈ శోభన మహోత్సవ ఆహ్వానం మాత్రం వింతగా విడ్డూరంగా ఉంది కదా.. క్రియేటివిటీకి హద్దులు లేని మాట నిజమే కాని కొన్ని పరిమితులు ఉంటేనే దానికైనా అందం. కాని కొందరి అత్యుత్సాహం పుణ్యమా అని తెలివి ఇలా కొత్త పుంతలు తొక్కుతోంది. దానికి తోడు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో ఏది జరిగినా వైరల్ కావడానికి క్షణాల కంటే తక్కువ సమయమే పడుతోంది.

Content above bottom navigation