కరోనాతో తల్లి మృతి … మృతదేహాన్ని కొడుకు ఏమి చేసాడో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

146

కోవిడ్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని దెబ్బకు లక్షల మంది హాస్పిటల్ లో పడగా, వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక కోవిడ్ 19 ప్రాణాల్నే కాదు.. మానవ సంబంధాల్ని, అనుబంధాల్ని సైతం దెబ్బతిస్తోంది.దానికి పంజాబ్‌ లో చోటు చేసుకున్న ఈ ఘటనే నిదర్శనం. నవమాసాలు కనిపెంచిన ఓ తల్లి దురదృష్టవశాత్తు కోవిడ్ 19 తో మరణించింది. అయితే ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. ఆఖరికి కన్న కొడుకు కూడా తల్లి డెడ్ బాడీని తీసుకెళ్లడానికి నిరాకరించాడు. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Coronavirus claims 97 lives in one day - but number of infections ...
అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ హీరోయిన్ ఊర్వశి రౌటేలా

షిమ్లాపురి గ్రామానికి చెందిన 69 ఏళ్ల వృద్ధురాలిని కోవిడ్ 19 లక్షణాలతో మార్చి 31న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. ఆమెను కార్వాన్టైన్ లో ఉంచి చికిత్స అందించారు. అయితే ఆమెకు వైరస్ హై లెవెల్ లో ఉండడంతో ఆమెను బతికించడం డాక్టర్స్ వలన కాలేదు. గత ఆదివారం ఆమె కోవిడ్ 19 రక్కసి కారణంగా ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లాలని జిల్లా అధికారులు ఆమె కుమారుడిని కోరారు. అయితే ఆమె కోవిడ్ 19 కారణంగా చనిపోవడంతో ఆమె శవాన్ని తీసుకెళ్లేందుకు కుమారుడు కానీ, బంధువులు కానీ ఎవరూ రాలేదు. ఆమెను ముట్టుకున్నా, ఆమె దగ్గరకు వెళ్లినా కూడా కోవిడ్ 19 వారికి కూడా సోకుతుందేమో అనే భయంతో ఎవరు కూడా ముందుకు రాలేదు. దీంతో అధికారులు షాక్ కు గురయ్యారు. ఇక బంధువులు ఎవరు కూడా ఆమెను తీసుకెళ్లడానికి ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ అధికారులే అంతిక సంస్కారాలు నిర్వహించారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న మౌని రాయ్

ఈ ఘటనపై అక్కడి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ స్పందించారు. డెడ్ బాడీ నుంచి ఇన్ఫెక్షన్ సోకకుండా అవసరమైన ప్రొటెక్టివ్ గేర్స్ కూడా ఇస్తామని చెప్పిన డెడ్ బాడీని ఎవరు తీసుకువెళ్లలేదన్నారు. ఆమె కుమారుడు కానీ, బంధువులు కానీ రాలేదని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులను అధికారులు రెండు సార్లు సంప్రదించారని… ఎవరూ కూడా ముందుకు రాలేదని తెలిపారు. ఈ ఘటన తమను షాక్ కు గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు చేసేదేమీ లేక… సోమవారం అర్ధరాత్రి జిల్లా అధికారులే అంత్యక్రియలను నిర్వహించారని చెప్పారు. మృతురాలి కుమారుడు, బంధువులు అంత్యక్రియలను 100 మీటర్ల దూరం నుంచి వీక్షించారని తెలిపారు. కోవిడ్ 19 ఇలా ప్రేమానురాగాలను కూడా దూరం చెయ్యడం కొంచెం విచారించాల్సిన విషయమే.

Content above bottom navigation