తెలుగు రాస్త్రాలల్లో ముంచుకొస్తున్న భీకర తుఫాను…

704

తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజుల రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వాతావరన శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి అని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్

ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం 24 గంటలలో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో అక్టోబర్‌ 12న వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఎక్కువ గా ఉంది. రాయలసీమ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

అలాగే రాయలసీమ ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం సాయంత్రపు వేళ చిన్నగా మొదలైన వర్షం… ఆ తర్వాత కొద్ది కొద్ది సమయం లోనే కుంభ వృష్టి గా కురిసింది. మూడు గంటలకు పైగా ఎడతెరిపి లేకుండా దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షం ఒక్కసారిగా భాగ్యనగరాన్ని వణికించింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో ఉద్యోగస్తులు, ప్రజలు నరకం చూశారు. కేవలం గంటకు 2 సెంటిమీటర్లే తట్టుకునే హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ.. ఏకంగా 15 సెంటిమీటర్ల వర్షం కురిసేటప్పటికి అతలాకుతలం అయింది.

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్: అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే.. నిందుతుల లేఖ బయటపెట్టిన పోలీసులు

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation