ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: డ్రగ్స్ రాకెట్’లో శ్రద్దాకపూర్ .. రియాతో ఫాంహౌజ్లో భారీగా డ్రగ్స్ పార్టీ
ఇది బలపడి ఈనెల 20 నాటికి ఈశాన్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇటు ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: రష్యా వ్యాక్సిన్ ని వీలైనంత కొనకపోతే తీవ్ర పరిణామాలు… హెచ్చరిస్తున్న సైంటిస్టులు
ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనం కారణంగా ఈ నెల 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, కోస్తా, రాయలసీమల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేస్తున్నారు.