మర్కజ్ మసీదులో పరిస్ధితిలు మరీ ఇంత ఘోరమా ? వైరస్ సోకటానికి కారణాలు ఇవే ?

123

ఓ వారం రోజుల క్రితం వరకూ దేశంలోని చాలామందికి ఢిల్లీలొని మర్కజ్ మసీదు పేరు కూడా తెలిసుండదు. అలాంటిది కోవిడ్ 19 పుణ్యమా అని ఒక్కసారిగా ఇండియాలోనే కాదు ఏకంగా వరల్డ్ ఫేమస్ కూడా అయిపోయింది. ఎందుకంత ఫేమస్ అయిపోయిందంటే కోవిడ్ 19 వ్యాప్తికి మర్కజ్ మసీదే ప్రధాన కారణం కాబట్టి. వైరస్ వ్యాప్తి గురించి చెప్పాలంటే మర్కజ్ మసీదులో ప్రార్ధనలు మొదలవ్వక ముందు అయిపోయిన తర్వాత అని చెప్పుకోవాలి. నిజాముద్దీన్ ప్రార్థనల్లో కోవిడ్ 19 సోకిన వారు కూడా ఉండడంతో వారి వలన గుమిగూడి ఉన్న వారికి కూడా సోకింది. వారి సంఖ్యలో వేలల్లో ఉండడంతో, ఇప్పుడు వారి ద్వారా భారతదేశంలో కోవిడ్ 19 పంజా విసరుతోంది. అందుకే వందల్లో ఉన్న కోవిడ్ 19 కేసులు ఇప్పుడు నాలుగు వేలకు చేరింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా రోజూ వందల మంది కోవిడ్ 19 బాధితులు తేలుతున్నారు. ఆ కేసుల్లో ఈ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారే అధికంగా ఉన్నారు. మసీదులో ప్రార్ధనలైపోయి ఎవరి సొంతూర్లకు వాళ్ళు వెళ్ళిపోయిన వారిలో కొందరి కారణంగా వైరస్ బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.

malaysians in hyderabad : మర్కజ్‌ టు హైదరాబాద్ ...
బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

దీంతో ఒక్కసారిగా మర్కజ్ ప్రార్థనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి అంతమందికీ కోవిడ్ 19 సోకడానికి కారణమైన నిర్వాహకులపై ప్రజలు మండిపడుతున్నారు. అయితే ఆ ప్రార్థనల్లో ఏం జరిగింది? ఎందుకు ఇంతలా వైరస్ పాకింది అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. దీనికి సంబంధించిన సంచలన విషయం ఒకటి బయటపడింది. మర్కజ్ ప్రార్థనల సమయంలో వారు ఏ విధంగా ఉన్నారు? ఏం పనులు చేశారో ఆ ప్రార్థనల్లో పాల్గొన్న ఓ వ్యక్తి చెప్పారు. ఆ వ్యక్తి చెప్పిన వివరాలు వింటే ఆశ్చర్యమేస్తోంది. కోవిడ్ 19 వ్యాపిస్తున్న వేళ కూడా వారు నిర్లక్ష్యంగా.. ఇష్టారీతిన వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆ ప్రార్థనల సమయంలో ఒక పెద్ద ప్లేటులో ఆహార పదార్థాలు పెట్టుకుని ఒకేసారి నలుగురు తినారంట. అనంతరం వారి భోజనం పూర్తి చేశాక, ఆ ప్లేటు కడగకుండానే మరికొంత మందికి అదే దానిలో వడ్డించారంట. ఆ విధంగా దాదాపు ఆరేడు సార్లు చాలా మంది తిన్నారంట. ఆ విధంగా ఆ ప్రార్థనలు జరిగినన్నాళ్లు ఆ ప్లేటులోనే ఈ విధంగా వందల మంది తిన్నారు.

దీంతో పాటు టాయిలెట్ల వద్ద ఇంకా దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. టాయిలెట్ల కోసం కొన్ని నిమిషాల పాటు వరుసలో నిలబడ్డారంట. ఒకరు పోసిన తర్వాత మరొకరు పోయడానికి దాదాపు అర్థగంట పాటు వేచి ఉన్నారంట. అయితే టాయిలెట్ల దగ్గర నిరంతరం విసర్జన చేస్తుండడంతో అక్కడ దుర్వాసన వెదజల్లింది. అసలు విరామం లేకుండా పదుల సంఖ్యలో నిలబడ్డామని ఆ వ్యక్తి చెప్పారు. ఇక ప్రార్థనల సమయంలో బహిరంగ ప్రదేశంలో వేల సంఖ్యలో గుమికూడి ఉన్నారు. మసీదులోని సౌకర్యాలు మహా అయితే ఓ రెండు మూడు వందలమందికి మాత్రమే సరిపోతుందట. కానీ అందులో 15 రోజులుగా సుమారు 13 వేలమందున్నారు. అంటే పరిస్ధితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు. అక్కడ మైదానంలో ప్రజలు కిక్కిరిసి ఉండడంతో, ఆ ప్రాంతంలో ఖాళీ స్థలం లేదు. వేలమందితో ఆ మైదానం నిండిపోయిందంట. ఇక ప్రార్థనల తర్వాత ట్రైన్ లో ఒకరి పక్కన ఒకరం కూర్చుని ప్రయాణం చేశారు. దీంతో ఏ ఒక్కరికి కోవిడ్ 19 ఉన్నా.. మిగతా వాళ్లందరికీ సోకకుండా ఆగలేదని ఆ వ్యక్తి కొన్ని మీడియాతో మాట్లాడారు. ఈ విధంగా వారు వ్యవహరించడంతో కోవిడ్ 19 వ్యాప్తి చెందింది.

Content above bottom navigation