హాజీపూర్ మర్డర్ మిస్టరీ

1494

సీరియ‌ల్ కిల్ల‌ర్ త‌న ప‌ని తాను చేసుకుపోయాడు, అన్ని హ‌త్యాల్లా ఇది కూడా బావిలో క‌ప్పిపోతుంది అనుకున్నాడు.ఆ నీశి చీక‌ట్లో త‌న చీక‌టి బాగోతాలు తెలియ‌వు అనుకున్నాడు.కాని పాపం పండింది అత‌ని దొంగ చూపులు క‌న్నీంగ్ మెంటాలిటీ , వెకిలి వేశాలే అత‌న్ని అనుమాన‌పు చూపుల‌తో చూశాయి.ఈ దారుణం చేసింది అతనే అనే అనుమానం చాలా మందికి వ‌చ్చింది. చివ‌రికి క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లి, ఉరికంభం ఎక్క‌పోతున్నాడు, హ‌జీపూర్ సీరియ‌ల్ కిల్ల‌ర్ శ్రీనివాస్ రెడ్డి.అస‌లు ఆ గ్రామంలో ఏం జ‌రిగింది అత‌ను చేసిన దుర్మార్గాలు ఏమిటి అనేది చూస్తే.తెలంగాణలో పెను సంచలనం హాజీపూర్‌లో ముగ్గురు బాలికల హత్యల కేసు. ఈ కేసులో శ్రీనివాస్‌ని దోషిగా తేల్చిన ఫోక్సో స్పెషల్ కోర్టు… అతనికి ఉరే సరైన శిక్ష అని తీర్పు ఇచ్చింది. శ్రావణి కేసులో ఉరిశిక్ష,కల్పన కేసులో ఉరిశిక్ష, మనీషా కేసులో జీవిత ఖైదు విధించింది.

Image result for హాజీపూర్ మర్డర్ మిస్టరీ

శ్రీనివాస రెడ్డి వేర్వేరు సందర్భాల్లో ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడి… వారిని హత్య చేసినట్లు ఆధారాల్ని సేకరించిన పోలీసులు… గతేడాది జూలై 31న కోర్టులో ఛార్జిషీట్ వేశారు. ఫోరెన్సిక్ రిపోర్టులో కూడా శ్రీనివాస రెడ్డే ఈ దారుణాలకు పాల్పడినట్లు తేలింది. శ్రీనివాస్ రెడ్డి సెల్‌ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు, వీడియోలను బట్టి కూడా అతనే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు స్పష్టమైంది.అందువల్ల అతనే నేరాలు చేసినట్లు బలమైన సాక్ష్యాలు ఉన్నట్లయ్యింది. కాబట్టి… అతన్ని దోషిగా నిర్ధారిస్తూ… అతనికి ఉరిశిక్ష వెయ్యాలని బాలికల కుటుంబ సభ్యులు, హాజీపూర్ గ్రామస్థులూ కోరుతూ వచ్చారు.ఈ కేసులో పోలీసులు 300 మంది సాక్షుల్ని ప్రశ్నించారు. 101 మంది సాక్షులు చెప్పిన మేటర్‌ను కోర్టు నమోదు చేసింది. ఈ కేసులో తాను నిర్దోషిని అని శ్రీనివాస్ చెబుతున్నా… అతనే నేరం చేశాడని నిరూపించేందుకు డీఎన్ఏ, రక్తపరీక్షలు, పోస్టుమార్టం రిపోర్టు, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్… అన్నీ పక్కా ఆధారాలుగా నిలిచాయి. ఆధారాలు బలంగా ఉన్నప్పుడు… కోర్టులు కూడా క్లారిటీగా తీర్పులు ఇస్తాయి. శ్రీనివాస్ విషయంలో అతను చెప్పిన మాటలన్నీ అబద్ధమని కోర్టు ఇదివరకే తేల్చింది.

Image result for హాజీపూర్ మర్డర్ మిస్టరీ

. బొమ్మల రామారం మండలం హజీపూర్‌ గ్రామంలో మిస్సింగ్ అయిన ముగ్గురు అమ్మాయిల మృతదేహాలు… ఆ ఊరి శివార్లలో పాడుబడిన బావిలో వేర్వేరు చోట్ల లభ్యమయ్యాయి. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ బాధితురాలిని శ్రీనివాస్ రెడ్డి… బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ దొరకడంతో… తీగలాగిన పోలీసులకు… స్థానికుల చొరవతో బావిలో మృతదేహాలు లభించాయి. శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చెయ్యగా… అతను బాలికలకు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి… వారితో పరిచయం పెంచుకొని… తర్వాత వారిని ఎత్తుకెళ్లి, రేప్ చేసి… చంపి, పూడ్చి పెడుతున్నట్లు స్పష్టమైంది.శ్రీనివాస్ రెడ్డి 11, 14, 17 సంవత్సరాల వయసు లో ఉన్న ముగ్గురు అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చే నెపంతో బండి మీద ఎక్కించుకొని అతని పొలంలో బోరు బావి ద‌గ్గ‌ర‌కు తీసుకుని వెళ్ళి చంపేశాడు .

ఈ క్రింది వీడియోని చూడండి

ఒక అమ్మాయిని మార్గమధ్యలో తన ఇంటి తాళం మర్చిపోయానని బండిని రూటు మార్చగా …. మరో అమ్మాయితో పొలంలోని మోటారు స్విచ్ ఆన్ చేయాలి అని చెప్పి అక్కడికి తీసుకు వెళ్లి చంపేశాడు . ఇంకొక అమ్మాయిని నేరుగానే తన కోరిక తీర్చాలని అడగగా ఆమె ఒప్పుకోకపోయేసరికి వెంటాడి చంపేసి బోరుబావిలో విసిరేశాడు.. ఇలా చేసిన త‌ప్పులు క‌ప్పిపుచ్చుకునేలా ప్ర‌య‌త్నం చేశాడు కాని అత‌నికి ఉరిశిక్ష విధించింది కోర్టు.బాలికలపై ఇంత దారుణంగా వ్యవహరించి… నరరూప రాక్షసుడిలా మారిన శ్రీనివాస్ రెడ్డి ఇంకా బతికే ఉండటంపై మృతుల కుటుంబ సభ్యులతోపాటూ… హాజీపూర్ వాసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతన్ని కోర్టు శిక్షించలేకపోతే… తమకు అప్పగించాలనీ, తామే చంపేస్తామనీ చాలాసార్లు మీడియాకు చెప్పారు. ప్రాసిక్యూషన్ కూడా శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని జనవరిలో వాదనలు వినిపించింది. తాజాగా కోర్టు తీర్పు ఇవ్వడంతో… ఇక తీర్పును అమలు చేసే ప్రక్రియ మొదలుకానుంది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation