లాక్ డౌన్ 3.0: మే 17 వరకు మూసేవి తెరిచేవి ఇవే..!

దేశవ్యాప్తంగా మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగించింది కేంద్రం. మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని మినహా రెడ్ జోన్ల పరిధిలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. వీటికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు ఎవరూ బయట తిరగకూడదు. అత్యవసరం అయితేనే రావాలి. అన్ని జోన్లలో 65 ఏళ్లు పైబడిన వ‌ృద్ధులు, రోగులు, 10 ఏళ్ల లోపు చిన్న పిల్లలు, గర్భిణీలు బయటకు రాకూడదు.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి:

1. జోన్లతో సంబంధం లేకుండా వీటిపై నిషేధం
దేశీయ, అంతర్జాతీయ విమానాలు, రైళ్లు, మెట్రో సర్వీసులు,అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై నిషేధం కొనసాగుతుంది. ఐతే పోలీస్, ఆర్మీ సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. వలస కార్మికులను తరలించే ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఇక స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు,హాస్పిటాలిటీ సర్వీసులు, సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటైర్‌టైన్ మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, బహిరంగ సభలు, సామూహిక మత ప్రార్థనలు, ప్రార్థనాలయాలు తెరచుకోవు.

దేశవ్యాప్తంగా అన్ని రకాల ట్రక్కులు అన్ని రాష్ట్రాల్లో తిరగవచ్చు. ఐతే ఇద్దరు డ్రైవర్లు, ఒక హెల్పర్ మాత్రమే ఉండాలి. రాష్ట్రాల మధ్య లారీల రవాణాలకు ప్రత్యేక పాసులు అవసరం లేదు. కేవంల లైసెన్స్ ఉంటే సరిపోతుంది.

రెడ్‌జోన్లు:

కంటైన్‌మెంట్ జోన్లు: ఈ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు పెట్టి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేయాలి. కేవలం నిత్యావసరాలు, మందుల కోసమే అనుమతించాలి. చెక్‌పోస్టు నుంచి బయటకు, లోపలికి వచ్చే వ్యక్తుల పేర్లను నమోదు చేయాలి. ఇక్కడ క్లినిక్‌లు, ఆస్పత్రుల్లో ఓపీ సేవలపైనా నిషేధం ఉంటుంది.

నాన్ కంటైన్ మెంట్ జోన్లు:పైన చెప్పిన వాటితో పాటు ఇక్కడ రిక్షాలు, ఆటోలు, టాక్సీలు, బస్సులు, బార్బర్ షాపులు, స్పాలపైనా నిషేధం ఉంటుంది. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లే వారికి సొంత వాహనాల్లో అనుమతి ఉంటుంది. కారులో ఇద్దరు, బైక్‌పై ఒక్కరు మాత్రమే వెళ్లాలి. నిత్యావసరాల మానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఫార్మా కంపెనీలు, ఐటీ హార్డ్ వేర్, జనపనార మిల్లులకు అనుమతి. ఇక్కడ పనిచేసే సిబ్బంది సామాజిక దూరం పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పరిశ్రమలకు అనుమతి ఉంటుంది. నిర్మాణ పనులకు స్థానిక కూలీలతో నిర్వహించుకోవచ్చు. నగరాల్లో ఒక్కరు మాత్రమే ఉండే చిన్న షాపులను నిర్వహించుకోవచ్చు. నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని దుకాణాలకు అనుమతి. ఐతే కస్టమర్లు రెండు అడుగుల సామాజిక దూరం పాటించాలి. వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. నిత్యావసర సరుకులను సరఫరా చేసే ఈకామర్స్‌ సైట్లకు అనుమతి ఉంటుంది. ప్రైవేట్ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో నిర్వహించవచ్చు. మిగతా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలి.

ఆరెంజ్ నోన్లు:
పాయింట్ నెంబర్ 1లో చెప్పిన అంశాలతో పాటు అంతర్ జిల్లా బస్సు సర్వీసులు, జిల్లాల లోపల తిరిగే బస్సులకు అనుమతి ఉండదు. ఒక డ్రైవర్, ఇద్దరు ప్యాసింజర్లతో టాక్సీలు నడుపుకోవచ్చు. కారులో ఆరెంజ్ జోన్‌లో ఉన్న ఇతర జిల్లాలకు ప్రయాణించవచ్చు. టూ వీలర్‌పైనా ఇద్దరు వెళ్లవచ్చు.

గ్రీన్ జోన్లు:
పాయింట్ 1లో పేర్కొన్న అంశాలు కాకుండా.. గ్రీన్ జోన్లలో మిగతా అన్నింటికీ అనుమతి ఉంటుంది. బస్సులు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడపవచ్చు. వైన్ షాప్స్, పాన్ షాప్స్‌లకు కూడా అనుమతి ఉంటుంది. ఐతే ఆరడుగల సామాజిక దూరం పాటించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది కేంద్రం.

జోన్‌ల వారీగా ఆంక్షలను సడలించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని జిల్లాలను జోన్‌ల వారీగా విభజించింది. కేంద్రం మార్గదర్శకాలను అనుగుణంగా ఇక్కడ ఆంక్షలను సడలిస్తారు. మరి తెలంగాణ, ఏపీలో ఏయే జిల్లాలు ఏ జోన్లలో ఉన్నాయో ఇక్కడ చూడండి.

తెలంగాణ:
రెడ్ జోన్
హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్
ఆరెంజ్ జోన్
నిజామాబాద్, గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట, మంచిర్యాల
గ్రీన్ జోన్

పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి,

ఆంధ్రప్రదేశ్:
రెడ్ జోన్
కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు,
ఆరెంజ్ జోన్
పశ్చిమ గోదావరి, కడప, అనంతపూర్, ప్రకాశం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం,
గ్రీన్ జోన్
విజయనగరం

Content above bottom navigation