క‌రోనా ఎఫెక్ట్ ‌: దేశంలో లాక్‌డౌన్ పొడిగించిన రాష్ట్రాలు ఇవే.

కోవిడ్ 19 మహమ్మారి దేశాన్ని కుదిపేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ 19 కేసుల సంఖ్య 18 లక్షలకు దగ్గరగా ఉంది. మృతుల సంఖ్య లక్ష దాటింది. ఇక భారత్ లో కూడా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. భారత్ లో కేసుల సంఖ్య 8 వేలు దాటింది. మృతుల సంఖ్య 273 గా ఉంది. ఇక దేశంలో కోవిడ్ 19ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక 21 రోజుల పాటు కొనసాగుతున్న ఈ లాక్‌ డౌన్ ఏప్రిల్‌ 14వ తేదీతో ముగియనుండటంతో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా..? లేదా అన్న దానిపై అన్ని మథనం కొనసాగుతోంది. కేంద్రంతో పాటు చాలా రాష్ట్రాలు కూడా దీనిపై ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాయి. లాక్ డౌన్ ను పొడిగిస్తేనే మంచిదని అన్ని రాష్టాలు అభిప్రాయపడుతున్నాయి.

Ayodhya land dispute: No place for bitterness, fear, negativity in ...
సెగలు పుట్టించేలా నిక్కీ తంబోలీ అందాలు..

ఇదే స‌మ‌యంలో ప‌లు రాష్ట్రాలు మాత్రం కేంద్రం నిర్ణ‌యంతో సంబంధం లేకుండా త‌మ‌త‌మ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ పొడిగించేశాయి. మిగతా రాష్టాలు కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. దేశంలోని 6 రాష్టాలు ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. ముందుగా ఈ విష‌యంపై ఒడిశా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఆ త‌ర్వాత‌ పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ పొడిగించినా.. స‌డ‌లించినా.. ఆయా రాష్ట్రాల్లో మాత్రం లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌న్న‌మాట‌. ఇదే దారిలో మ‌రికొన్ని రాష్ట్రాలు కొన‌సాగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక్క‌డ మరొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ రాష్ట్రాల‌న్నీ కూడా బీజేపీయేత‌ర పాలిత రాష్ట్రాలే కావ‌డం గ‌మ‌నార్హం.

హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హిమజ.

ఇక ఇందులో సుమారు 1700 పాజిటివ్ కేసుల సంఖ్య‌తో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉంది. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు దేశ వ్యాప్తంగా 8446 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇందులో 293 మంది మ‌ర‌ణించారు. ఇక 653 మందికిపైగా కోలుకున్నారు. లాక్‌డౌన్ గ‌డువు ఏప్రిల్ 14 ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య‌మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్ర‌ధానంగా మూడు నాలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ‌గా న‌మోదు అవుతోంది. ఇందులో సుమారు 1700 పాజిటివ్ కేసుల‌తో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉంది. ఆ త‌ర్వాత సుమారు వెయ్యి కేసుల‌కు చేరువ‌లో ఢిల్లీ, త‌మిళ‌నాడు రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో న‌మోదు అవుతున్న మొత్తం కేసుల్లో ఈ మూడు రాష్ట్రాల కేసులే దాదాపు 50శాతం ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో అటు ప్ర‌జ‌ల్లో ఇటు ప్ర‌భుత్వాల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ లాక్‌డౌన్‌ను పొడిగించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు చెబుతున్నాయి.

Content above bottom navigation