భారత్‌లో అదుపులో లేని కరోనా?… ఆపాలంటే అదొక్కటే మార్గం

దేశంలో కరోనా ఎందుకు ఆగట్లేదు? ఓవైపు లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చి 8 రోజులు దాటినా ఇంకా ఎందుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి? చిత్రమేంటంటే… లాక్‌డౌన్‌కి ముందు కంటే… లాక్‌డౌన్ తర్వాతే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఐతే… లాక్‌డౌన్ తెచ్చాం కాబట్టే… కేసుల సంఖ్య తక్కువగానే ఉందనీ, అదే అమల్లోకి తేకపోయి ఉంటే… ఈ పాటికే… కేసుల సంఖ్య రోజూ వేలల్లో ఉండేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రెండువైపులా వాదనలు బలంగానే ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే… కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇప్పటికే 1500 దాటేసింది. మరి ఈ 14 రోజుల్లో కరోనా కంట్రోల్ కాకపోతే నెక్ట్స్ ఏంటి?

Huge Shelters for Coronavirus Patients Pose New Risks, Experts ...

గత రెండ్రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు దేశంలో వందల కొద్దీ నమోదవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీలో మార్చిలో జరిగిన ప్రార్థనలు, సదస్సేనని అనుకుంటున్నాయి రాష్ట్రాల ప్రభుత్వాలు. అదే నిజమైతే… మున్ముందు కూడా మరిన్ని కేసులు పెరిగే ప్రమాదం ఉంది. ఆ సమావేశాలకు వెళ్లిన వారు… తిరిగి వచ్చిన తర్వాత… 10 రోజులు గడిచాక… ఇప్పుడు వారిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ 10 రోజుల్లో వారి నుంచి ఎంత మందికి కరోనా సోకి ఉంటుంది అన్నది ఇప్పుడు కొత్తగా తలనొప్పిగా మారిన అంశం. అలా సోకి ఉంటే… ఆ సోకిన వారి నుంచి ఇంకెంత మందికి కరోనా సోకుతుందన్నది తేలాల్సిన అంశం.

Gilead's Coronavirus Drug Trial Slowed by Lack of Eligible ...
తమన్నా చీరలో మొత్తం చూపించేసింది ఆసలు తట్టుకోలేరు

ఇదంతా గమనించాక… మనకు అర్థమయ్యేది ఒకటే… ఇండియాలో కరోనా వైరస్ కేసులపై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు కంట్రోల్ లేకుండా పోయింది. ఎవరెవరిలోనో తమకు తెలియకుండానే కరోనా వైరస్ చేరిపోయినట్లైంది. అందువల్ల ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ… తమ రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు లేవని చెప్పే పరిస్థితి లేదు. మరి కరోనాపై పూర్తి కంట్రోల్ రాకపోతే… ఇక లాక్‌డౌన్ చేసి ఏం ప్రయోజనం…. ఏప్రిల్ 14 తర్వాత కూడా ఇలాగే ఉంటే… ఎలా?చైనాలో ఇలాగే కంట్రోల్ తప్పినప్పుడు ఆ దేశం… మొత్తం దృష్టంతా వుహాన్ నగరం, దాని చుట్టూ ఉన్న హ్యూబే ప్రావిన్స్‌పై పెట్టింది. ఒక్కసారిగా అక్కడి ప్రజలను పూర్తిగా దిగ్బంధించింది. బయటివారు లోపలికి, లోపలి వారు బయటకు వెళ్లకుండా చేసింది. ఆ తర్వాత… లోపలి ఉన్న కోటి మందికి పైగా జనాభాకి టెస్టులు జరిపించింది. అలా ప్రతీ వారమూ అందరికీ టెస్టులు చేస్తూనే ఉంది. ఫలితంగా… చైనాలో ఈ వ్యాధి పూర్తిగా కంట్రోల్ అయ్యింది. డిసెంబర్‌లో తొలి కేసు రాగా… ఫిబ్రవరి కల్లా చైనా ఈ వ్యాధిని కంట్రోల్ చెయ్యగలిగింది. ఇప్పుడు చైనా గుండెలపై చెయ్యి వేసుకొని… తమ దేశంలో ఎంత మందికి కరోనా ఉందో… 100 శాతం కచ్చితంగా చెప్పగలుగుతోంది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

ఇండియా కూడా ఇలా చెయ్యకతప్పదంటున్నారు నిపుణులు. దేశంలోని 130 కోట్ల మందికీ టెస్టులు చెయ్యించడమే సరైన పరిష్కారం అంటున్నారు. ఏ ఇంట్లో ఎంత మందికి కరోనా ఉందో తెలియట్లేదు కాబట్టి… అందరికీ టెస్టులు చేస్తే… కచ్చితంగా కరోనా ఉన్న వారందర్నీ క్వారంటైన్ చెయ్యవచ్చనీ, తద్వారా కొత్తగా ఎవరికీ వైరస్ రాకుండా చేసేందుకు వీలవుతుందని అంటున్నారు. ఇదేమంత ఈజీ ప్రక్రియ కాకపోయినా… ఇండియాలో కరోనా కంట్రోల్ అవ్వాలంటే… ఇదొక్కటే ఇప్పుడున్న సరైన మార్గం అంటున్నారు.

Content above bottom navigation