టీమిండియా క్రికెటర్ తో అనుష్క పెళ్లి…?

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటే ముందు గుర్తుకువచ్చే పేరు అనుష్క. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి, టాప్ ప్లేస్ కు చేరుకుంది. దాదాపు దశాబ్దనర కాలంగా తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాలలో నటించింది. దేవసేన, భాగమతి, జేజమ్మ.. ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోవడం ఈ బెంగళూరు భామ స్పెషాలిటీ. ఇంచుమించు అందరు స్టార్ హీరోస్ పక్కన నటించింది ఈ బ్యూటి. ముఖ్యంగా బాహుబలి సినిమాలో దేవసేన పాత్రతో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. గతంలో కూడా అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, మిర్చి లాంటి భారీ హిట్స్ అందుకుంది. తనదైన అందం, అభినయంతో అభిమానులను మెస్మరైజ్ చేయడం అనుష్క స్పెషాలిటీ. ఇక అభిమానులు మాత్రం ఆమెను ముద్దుగా ‘స్వీటీ’ అని పిలుస్తుంటారు. ఇండస్ట్రీ పెద్దలకూ ఆమె స్వీటీనే.

అనుష్క పెళ్లి అతనితోనేనా..? వైరల్ అవుతున్న వార్త

అయితే తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్టని టాపిక్ అనుష్క పెళ్లి. ఈ భామ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ తప్ప క్లారిటీ రాలేదు. ఓ వైపు వయసు 40కి చేరువవుతుంటే.. రోజు రోజుకి రూమర్లు ఎక్కువైపోతుంటే అనుష్క పెళ్లిపై రోజుకో వార్త బయటికి వస్తుంటే అభిమానుల్లో కూడా కంగారు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌ తో కొన్నాళ్లుగా అనుష్క డేటింగ్ చేస్తుందనే వార్తలు కూడా ఉన్నాయి. దీనిపై అటు ప్రభాస్.. ఇటు అనుష్క నో అనే సమాధానాలే చెప్పారు. అలాగే బెంగుళూర్ కు చెందిన వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి అని వార్తలు వచ్చాయి. ఇలా అనుష్క పెళ్లిపై ఇప్పటికే అనేక పుకార్లు వచ్చాయి. కొంతమంది హీరోలతో కూడా ఆమె ప్రేమ, పెళ్లి అని టాక్ వచ్చింది. అయితే ఇక ఇప్పుడు ఓ క్రికెటర్ పేరు వినిపిస్తోంది. ఎవరు అనేది స్పష్టత లేదు గాని ఉత్తరాది ఆటగాడు అని టాక్ వినిపిస్తోంది. టీమ్ ఇండియాలో అతను ఒక కీ ప్లేయర్ అని, ఇద్దరు ఒక పార్టీలో కలుసుకున్నారని, ఇద్దరు చాలాకాలంగా రహస్యంగా ప్రేమించుకుంటున్నారని, వీరి పెళ్ళికి ఇంట్లో కూడా ఒకే చెప్పారని, త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం మీద అనుష్క స్పందించేంతవరకు అసలు నిజం ఏంటో తెలియదు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇదిలా ఉంటే త‌న పెళ్లి ఇప్ప‌ట్లో ఉండ‌ద‌ని ఈ మధ్యనే క్లారిటీ ఇచ్చింది అనుష్క‌. ఆ మ‌ధ్య కార్తికేయ పెళ్లిలో కావాల్సినంత ర‌చ్చ చేసిన అనుష్క‌.. అక్క‌డ త‌న పెళ్లి గురించి అడిగిన వాళ్ల‌కు ఈ విధంగా స‌మాధానం ఇచ్చింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో నిజం ఎంతుందో తెలియ‌దు కానీ అనుష్క పెళ్లి అయితే ఇప్ప‌ట్లో లేన‌ట్లే అనేది మాత్రం క‌న్ఫ‌ర్మ్. ప్రస్తుతం నిశబ్దం అనే ఇంటర్నేషనల్ మూవీలో నటిస్తుంది అనుష్క. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విలక్షణ నటుడు ఆర్.మాధవన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల అవ్వనుంది. ఇందులో రంగ‌స్థ‌లంలో రామ్ చ‌రణ్ చేసిన‌ట్లు చెవుడు పాత్ర‌లో నటిస్తుంది అనుష్క‌. ఈ చిత్ర షూటింగ్ ఫిబ్ర‌వ‌రిలో మొద‌లు కానుంది. ఇది పూర్త‌య్యే వ‌ర‌కు మ‌రో ఏడాదైనా ప‌డుతుంది. అప్ప‌టి వ‌ర‌కు పెళ్లి ఊసే ఎత్తేలా క‌నిపించ‌డం లేదు జేజ‌మ్మ‌. చూడాలి మ‌రి అనుష్క ప‌ప్ప‌న్నం ఎప్పుడు పెడుతుందో.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation