‘అమృతా!! హాట్సాఫ్ యు బేటా’ : మాధవీలత షాకింగ్ పోస్ట్..

146

ప్రణయ్-అమృత ప్రేమ కథలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూప్‌లతో పెద్ద యుద్దమే నడుస్తోంది. అమృత వర్సెస్ మారుతీరావులుగా సోషల్ మీడియాలో రెండు గ్రూపులు తయారై.. చర్చల పరిధి దాటి వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది. ఈ తరుణంలో ఇలాంటి హాట్ టాపిక్ ఇష్యూస్‌ పై చర్చించి మీడియాలో ఫోకస్ తనవైపు తిప్పుకోవడంలో ముందుండే హీరోయిన్ మాధవీలత… అమృతకు తన మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్‌ను షేర్ చేసింది.

Image result for amrutha sravan

మాధవీలత షేర్ చేసిన పోస్ట్‌లో ఏమి ఉందంటే..అమృత… అలుపెరగని యోధురాలు. పగవాడికి కూడా రాని కష్టం ఆమెకు వచ్చింది. ఏ ఆడబిడ్డ పడకూడదనే నరకం అమృత అనుభవించింది. “ప్రణయ్ హత్య నుంచి మారుతీరావు ఆత్మహత్య వరకు” ఇలా చరిత్రలో కొంత భాగాన్ని మనం కళ్ల ముందు ఉంచుకునే ప్రయత్నం చేయవచ్చు కానీ ఆ ఆ కాలాల్లోని ఆమె వ్యధను‌‌ మాత్రం అక్షరాల్లోకి ఇరికించలేము. కోట్ల ఆస్తికి ఒక్కతే వారసురాలు. కావాలనుకున్నది ఏదైనా సరే కళ్ల ముందుకు, కాళ్ల వద్దకు తెచ్చుకోగలిగే సత్తా ఉంది. అయినా సరే ప్రేమించినవాడి కోసం సర్వాన్ని వదిలేసింది. ప్రేమను మాత్రమే ప్రణయ్ కు ఇచ్చి, తనకు కావల్సినదాన్ని ప్రణయ్ నుంచి తీసుకొని, ఆ తర్వాత ఏమి ఎరగనట్లు ఇంకొకడిని పెళ్లి చేసుకుని ఫారెన్‌కు చెక్కేయొచ్చు. కానీ అలా చేయలేదు. ప్రేమించినవాడి కోసం ప్రాణాలకు తెగించింది. నీ కోట్ల రూపాయలు నా వెంట్రుకతో సమానమని తన తండ్రికి చెప్పి, ప్రణయ్ కోసం అందరిని, ఐశ్వర్యాన్ని కాలితో తన్ని వచ్చేసింది. ఈ తెగువను, ఓర్వలేని మారుతీరావు ప్రణయ్‌ ను హత్య చేయించినా కడుపులో ఉన్న బిడ్డ కోసం బతికింది. ప్రణయ్ తమ్ముడిని పెళ్లి చేసుకుంటోందని కొందరు, 9వ తరగతిలోనే కడుపు చేయించుకుందని కొందరు వాగితే భరించింది. తనను ఒంటరిని చేసి వేధిస్తున్న లోకాన్ని చూసి జాలిపడిందే కానీ దేవుడా, నన్ను కాపాడు, నన్ను అందరూ ప్రేమించేలా చేయ్ అంటూ వేడుకోలేదు అందుకే “Amrutha is an Warrior”

Image result for amrutha madhavi latha

ఆస్తి ఇస్తా వచ్చేయ్ అని మారుతీరావు ఆశ చూపించినా లొంగలేదు. బాబు పుట్టాక కూడా ఆమె రాజీ ప్రయత్నాలకు తలొగ్గలేదు.. హంతకుడైన తండ్రికి శిక్ష పడాలనే కోరుకుంది.‌ ప్రణయ్ చనిపోయాడు ఇక ఇదంతా ఎందుకని ఊరుకోలేదు. మారుతీరావుపై మళ్లీ కంప్లైంట్ చేసింది. రాబందుల్లా పొడుచుకుతినే మనుషులతో మాత్రమే కాదు తనలో తాను కూడా యుద్ధం చేస్తూనే ఉంది. ఎన్నెన్ని మాటలు అన్నా , ఎన్నెన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా అవేమీ ఆమెను కదిలించలేకపోయాయి, అమృత సంకల్పాన్ని టచ్ చేయలేకపోయాయి..ఇలా బతకాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి…మారుతీరావును అమృత మన్నించలేదు, కానీ ఆ దుర్మార్గుడి చివరి కోరికను మాత్రం మన్నించింది. అందుకే ఆమె తల్లి కోసం.. ప్రాణాలకు తెగించి మరీ శ్మశానానికి వెళ్లింది. వాళ్ల కుట్రలన్నీ ఇంకా బయటపడతాయనే భయంతో ఆమెను రానీయలేదు. అయినా సరే… మా అమ్మ వస్తే నేను తనకు అమ్మనవుతానంటూ తనలోని మాతృత్వాన్ని రెట్టింపు చేసుకుంది. ఆస్తి కోసమే డ్రామా ఆడుతోందనే కామెంట్లను జాడించి కొట్టింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఎంతో నరక యాతన పడుతోంది అమృత. కొందరు బేవకూఫ్ గాళ్లు అడిగిన ప్రశ్నలకు, ప్రెస్ మీట్‌ లో తడుముకోకుండా బదులిచ్చింది అమృత. అందుకే కదా ఆమె ఒక యోధురాలు. కానీ ఎంతకాలం..? ఇంకెంతకాలం..? అమృత ఇలా ఉండటం నాకైతే ఇష్టం లేదు.. ఇలాగే మోడు వారిన జీవితంలో మగ్గిపోవటం‌ అసలు ఇష్టం‌ లేదు. కొన్నాళ్ల తర్వాత అంటే.. తన లక్ష్యం నెరవేరిన తర్వాత అమృత మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాలి.. మరొక తోడుతో భవిష్యత్తును నిర్మించుకోవాలి. రక్తం పంచుకుని పుట్టినోడిని‌ మరో మారుతీరావు కాకుండా చూడాలి. ప్రణయ్ జ్ఞాపకాల్లోంచి వీలయినంత త్వరగా బయటపడాలి. ఇందుకు ప్రణయ్ ఫ్యామిలీతో పాటు మనమంతా సహకరించాలి.. అదేంటీ అమృత ఇంకొక పెళ్లి చేసుకోవాలా అంటే అవుననే అంటాను.

తన హోయలతో షేక్ చేస్తున్న శ్రద్ధా కపూర్

ఆమె విధవలానే ఉండాలి, అలంకరణకు దూరమవ్వాలి, మరొకరికి దగ్గర కాకూడదు అని వాదిస్తే.. వాళ్లెవరైనా సరే నాగరిక సమాజంలో ఆటవికులు, భర్త చితి మీదే భార్యను తగలబెట్టిన “సతీసహగమనాన్ని” మళ్లీ బతికించాలని బలంగా కోరుకునే కులమత ఉన్మాదులే అంటాను నేను.. So,This is not an End, End Means… it doesnt Mean that Every thing is Nothing..End Means Everything Raises from Nothing.. Finally Every End is a “New Begining”… అమృత … మై డియర్ వారియర్, ప్రౌడ్ ఆఫ్ యు బేటా’ అంటూ పోస్ట్‌ను షేర్ చేసింది మాధవీలత. అయితే ఈ పోస్ట్‌లో మాధవీలత, అమృతకు అండగా నిలవడంతో మారుతీరావు సపోర్టర్స్ ఆమెపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ‘నీకు కూడా అమృత లాంటి కూతురే ప్రాప్తించు గాక, అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ ఏంటో ’ అంటూ ఓ నెటిజన్ స్పందించగా.. మరో నెటిజన్ మాధవీలత పోస్ట్‌కి మద్దతు ప్రకటిస్తూ.. ‘నాకైతే అమృత లాంటి బిడ్డనే ఇవ్వాలని కోరుకుంటా.. కాని మారుతీరావులా మాత్రం పెంచను, ప్రాణం తీయను.. తీసుకోను’ అంటూ స్పందించారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation