తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం.. లాక్ డౌన్ పొడగింపు..!

కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. తెలంగాణ న్యాయ వ్యవస్థ లాక్డౌన్ను మరోసారి పొడిగించింది. కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్డౌన్ను జూన్ 28 వరకు పొడిగిస్తూ….హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

అత్యవసర, తుది విచారణ కేసులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని జిల్లా కోర్టులకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వైపుల లాయర్లు ప్రత్యక్ష విచారణ కోరితే జ్యుడిషియల్ అకాడమీలో ఏర్పాటు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

జిల్లా, మేజిస్ట్రేట్ కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్డౌన్ ఈ నెల 14 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర, కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాలని సూచించింది.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాల్లో నేరుగా పిటిషన్లను దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. కోర్టుల్లో మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తప్పక పాటించాలని హైకోర్టు… కోర్టులను ఆదేశించింది.

Content above bottom navigation