హైకోర్టులో జగన్ సర్కార్‌ కు ఎదురుదెబ్బ.. ఆ రెండు జీవోలు కొట్టివేత

హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇందుకు సంబంధించి ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో 81, 85ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఈ రెండు జీవోలు 81,85 లను సవాల్ చేస్తూ ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్‌పై విచారణ జరిపింది. ఏ మీడియంలో చదుకోవాలి అన్నది విద్యార్థులు, తల్లిదండ్రుల ఇష్టమని.. బలవంతంగా ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఇబ్బందులు ఉన్నాయని, ఆంగ్ల మాధ్యమాన్ని తప్పని సరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్ లు మిగిలిపోయే అవకాశం ఉందని లాయర్ కోర్టు దృష్టితీసుకెళ్లారు.. వాదనలు విన్న హైకోర్టు ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రభుత్వ జీవోను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. పిటిషనర్ తరపు, ప్రభుత్వ తరపు లాయర్ల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేయగా.. ఇవాళ జీవోలను కొట్టేసింది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న శృతి హాసన్ పిక్స్

EVM: Supreme Court effaces High Court order on EVM criticism

ఏపీలో వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై పలు రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తూనే… తెలుగు మీడియం ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం సర్కార్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంది. భవిష్యత్తులో విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అని వాదించింది.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ కృతి కర్భంద

ఇంగ్లీష్ మీడియం విషయంలో వెనక్కు తగ్గని జగన్ సర్కార్ ఇటీవల జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయనున్నట్లు తెలిపింది. అలాగే ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూలును ఏర్పాటు చేయనుంది. ఉర్థు, ఒరియా, కన్నడ, తమిళ మీడియం స్కూళ్లను యథాతథంగా కొనసాగించనున్నారు. ప్రతి మీడియం స్కూల్‌ లోనూ తెలుగును తప్పనిసరి చేయాలని ఆదేశాలిచ్చారు.. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు బస్సు ఛార్జీలు కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టేయడంతో… ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై ఏ రకంగా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది.

Content above bottom navigation