ప్రణయ్, మారుతీరావు నివాసాల వద్ద భారీ బందోబస్తు

143

దేశవ్యాప్తంగా మిర్యాలగూడ కులాంతర వివాహ ఘటన ఎంత సంచలన స్పృష్టించిందో మనకు తెలుసు. కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో కక్షగట్టి కూతురు భర్త ప్రణయ్‌ని దారుణంగా హత్య చేయించాడు అమ్మాయి తండ్రి మారుతీరావు. ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత రెండు రోజుల క్రితం అమృత తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంగతి మన అందరికి తెలుసు. ఇక ఈ ఘటన తర్వాత మిర్యాలగూడలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అమృత, శ్రవణ్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తండ్రి చావుకు అమృత కారణం అని మారుతీరావు కుటుంబ సభ్యులు అంటుంటే, అతనికి రాజ్యాంగం పరంగా శిక్ష పడాలని కోరుకున్నా, కానీ ఆత్మహత్య చేసుకోవాలని నేను కోరుకోలేదని మారుతీరావు కూతురు అమృత అంటుంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ నేపథ్యంలో మిర్యాలగూడలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటం కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రణయ్ చనిపోయిన తర్వాత అమృతకు రక్షణ కోసం ఇప్పటికే ఆమె ఇంటి దగ్గర ఇద్దరు పోలీసులు బందోబస్త్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మారుతీరావు ఆత్మహత్యతో అమృతకు సెక్యూరిటీని పెంచారు. ప్రణయ్‌ కుటుంబానికి మొత్తం 8 మంది పోలీస్ గన్ మెన్ లు ఇప్పుడు అమృత కుటుంబానికి రక్షణగా ఉన్నారు. టూ టౌన్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఏఎస్‌ఐ గౌసు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బయటకు వెళ్లాలంటే , వారి వెంట ఒక గన్ మెన్ ఖచ్చితంగా వెళ్లనున్నారు. అదే విధంగా మారుతీరావు ఇంటి వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్‌ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

Image result for ప్రణయ్, మారుతీరావు నివాసాల వద్ద భారీ బందోబస్తు

ఏది ఏమైనా ఒక కులాంతర ప్రేమ వివాహం వలన రెండు ప్రాణాలు పోయాయి. ఒక ప్రేమపెళ్లి కారణంగా రెండు కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాయి. భర్తను తండ్రిని పోగొట్టుకుని అమృత వేదన అనుభవిస్తుండగా.. కూతురి మీద ప్రేమతో పరువు ప్రతీకారాలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ప్రాణాలను బలితీసుకున్నాడు మారుతీరావు. అమృత పెళ్లి వలన ఇప్పుడు రెండు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రణయ్ చనిపోవడం వలన ఆ కుటుంబం సంవత్సనర నుంచి నరక అనుభవిస్తుంది. ఇప్పుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో మారుతీరావు భార్య అనాధ అయ్యింది. ఒకవైపు కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, మరొకపక్క జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. దీంతో గిరిజ దిక్కులేని దానిలా అయ్యింది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation